మ‌తిమ‌రుపు మంచిదే... కానీ...

మ‌రుపు మ‌నిషికి సుఖ సంతోషాల‌నిస్తుంద‌న్న‌ది మ‌న పూర్తీకుల ఉవాచ‌.నిజ‌మే మ‌న నిత్య‌జీవితంలో జ‌రిగే అనేక ఘ‌ట‌న‌లు ఎన్న‌ని గుర్తుపెట్టుకుంటాం.

వీటిలో మ‌న‌ల్ని బాదించేవీ బోలెడు.వాటిని అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌చిపోతే మంచిదే.

అలాగ‌ని జ‌రుగుతున్న మంచిని, అందుకు స‌హ‌క‌రించిన వారిని, స్నేహితుల్ని గుర్తుంచుకోవ‌ల‌సిందే.ఇంత‌కీ మతిమరుపులో చాలా రకాలుంటాయి.

ఇంట్లో ఒక వస్తువు ఎక్క‌డ పెట్టామో గుర్తుకు రాక‌పోవ‌టం, ఎవరికైనా ఒక పని చేసిపెడతానని చెప్పి మర్చిపోవడం,మ‌నకి నిత్య‌కృత్యం.అయితే చేసిన మేలును మర్చిపోవడం ఎంత ప్రమాదకరమైనదో మ‌న‌గ్రంథాలలో అనేక సాక్ష్యాలున్నాయి.

Advertisement

ఓ వస్తువుకోసం వెతికి వెతికి దొరకలేదని విసుగు చెందే మ‌న‌మే, క‌న‌పించ‌గ‌నే సంతోషిస్తాం.మ‌న మ‌తిమ‌రుపుకి మ‌న‌ల్నే మ‌నం తిట్టుకుంటాం.

కొంద‌మంది నిత్యం ఆయారోజుల‌లో ఉప‌వాసం, ఒక పొద్దు ఉండటం అల‌వాటే అయినా, ఒక్కోసారి అనాలోచితంగా ఎంగిలిప‌డ్డాక గాని ఆరోజు ఉండాల్సిన ఉప‌వాసం గురించి గుర్తుకురాదు.ఇక ఎదుటి వాడికి తాము గుర్తులేకుండా పోయామెందుక‌ని ఆలోచించేవారు మ‌రి కొంద‌రు.

ఈ త‌ర‌హా ఆలోచ‌న‌లు ఆరోగ్యానికి కీడు చేస్తాయి.అందుకే మ‌తిమ‌రుపు మంచిదేనంటారు కొంద‌రు మహానుభావులు.

మనిషికున్న అలవాట్లలో మతిమరుపు ఒకటి.‘మతిమరుపు లేనిదే జీవితం కొనసాగదు’ అని బాల్జాక్‌ మహాశయుడన్నాడు.

షారుఖ్ ఖాన్ ఎందుకు సౌత్ డైరెక్టర్ల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నాడు..?
వీధి ఆవులకు రొట్టెలు పెడుతున్న మహిళ.. వీడియో చూస్తే ఫిదా..

జ్ఞాపకాలతో బాధపడటం కంటె మరచిపోవడమే మేలు అన్నాడు ల్వాండన్‌ మహాశయుడు.‘నీకు తెలిసిన వాటిని మర్చిపోవడమే కొన్నిసార్లు మేలు’ సైరస్‌ అన్నాడు.

Advertisement

ఇలా మతిమరుపును గురించి ప్రముఖులు రకరకాలుగా వారి ఉద్దేశ్యాలను తెలిపారు.అయితే మనిషి ఉద్దేశ‌పూర్వ‌కంగానే అవివేకిగా మారిపోతున్నాడు.

ఒక్కోసారి తనను తానే మరచిపోతూ, తనని సృష్టి ంచి, స‌మాజంలో నిల‌దొక‌కుకునేలా చేసిన అమ్మ‌, నాన్న‌, గురువు, దైవం, ఈ స‌మాజం ప‌ట్ల త‌న బాధ్య‌త‌లు మరచిపోతూ, అదీ మ‌తిమ‌రుపే అని పేరు పెట్టేయ‌డ‌మే హీనాతి హినం.

తాజా వార్తలు