ప్రతిష్టాత్మకమైన ఫోర్బ్స్ బిజినెస్ మ్యాగజీన్ విడుదలైంది.అమెరికాలోని `వేల్ మీడియా`కు చెందిన ఈ ఫోర్బ్స్ మ్యాగజీన్ ఏడాదికి 8 మ్యాగజీన్స్ మాత్రమే విడుదల చేస్తుంది.
అయితే, ఇది పబ్లిష్ చేసే వార్తలు ఎల్లప్పుడు సంచలనమే.ఇది ప్రకటించే కంపెనీల పేర్లు ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైనవిగా ఉంటాయి.
అందులోనూ పలు కీలక విషయాలు, వివిధ రంగాల్లో పరిశోధన అనంతరం ఈ బిజినెస్ మ్యాగజీన్‌ను వేల్ మీడియా విడుదల చేస్తుంది.ఒక అంశాన్ని తీసుకుని అందులో ప్రపంచ వ్యాప్తంగా మెరుగైన ఫలితాలు కనబరిచిన కంపెనీలకు ర్యాంకులను కూడా కేటాయిస్తుంది.
ఫోర్బ్స్ పత్రికలో తమ కంపెనీ పేరు, తమ ఫోటో రావడాన్ని వరల్డ్ వైడ్‌గా ఉన్న కంపెనీలు, యాజమాన్యాలు ఈ విషయాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి.
తాజాగా 2021 ఏడాదికి సంబంధించి ఎంపాయీస్ విషయంలో కంపెనీలు ఏ విధంగా వ్యవహరిస్తున్నాయి అనే అంశంపై ఫోర్బ్స్ అధ్యయనం చేసి ఫలితాలను ప్రకటించింది.
ఇందులో భారత్ నుంచి రిలయన్స్ కంపెనీకి అరుదైన గౌరవం దక్కింది.ఈ ఏడాది ఫోర్బ్స్ ప్రకటించిన ఉత్తమ ఎంప్లాయర్ ర్యాకింగ్స్‌లో రిలయన్స్ 52వ స్థానాన్ని కైవసం చేసుకుంది.
వరల్డ్ వైడ్ మొత్తం 750 కంపెనీలను అధ్యయనం చేసి ఈ ర్యాంకింగ్స్ ప్రకటించారు.అందులో ముఖేష్ అంబానీ ఆధ్వర్యంలో నడుస్తున్న రిలయన్స్‌కు 52వ స్థానం రావడం గొప్ప విషయం.

అయితే, వరల్డ్ వైడ్ ఫోర్బ్స్ విడుదల చేసిన ర్యాంకులను ఒక్కసారిగా పరిశీలిస్తే సౌత్ కొరియాకు చెందిన సామ్సంగ్ కంపెనీ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది.ఆ తర్వాత IBM కంప్యూటర్స్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నాయి.మైక్రోసాఫ్ట్, యాపిల్, అమెజాన్, గూగుల్, డెల్, హువావేలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.వరల్డ్ వైడ్‌గా 58 దేశాలకు చెందిన 750 కంపెనీల నుంచి లక్షా యాభై వేల మంది ఫుల్ టైం, పార్ట్ టైం ఉద్యోగుల నుంచి ఈ వివరాలను సేకరించి ఫోర్బ్స్ ఈ జాబితాను తయారుచేసింది.
ఈ సర్వేలో ఉద్యోగుల నుంచి సంస్థ ఆర్థిక ప్రణాళిక, మ్యుచువల్ ఈక్వాలిటీ, టాలెంట్ డెవలప్మెంట్, సామాజిక బాధ్యత తదితర అంశాలపై దృష్టి సారించింది.కంపెనీల్లో మహిళలకు కల్పిస్తున్న అవకాశాలు, వేతనాలు ఇచ్చే తీరు, సెలవులను కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిపింది.

ఫోర్బ్స్ బెస్ట్ ఎంప్లాయర్ జాబితాలో టాప్ 100 లిస్టులో మొత్తం ఇండియా నుంచి కేవలం 4 సంస్థలకే చోటు దక్కింది.అందులో రిలయన్స్ 52వ స్థానం, ఐసీఐసీఐ బ్యాంక్ 65వ స్థానం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 77, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 90వ ర్యాంకును దక్కించుకున్న వాటిలో ఉన్నాయి.