అధ్యక్ష ఎన్నికల వేళ డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ రిలీఫ్.. ఆ కేసు కొట్టివేత

దుండగుడి చేతిలో కాల్పులకు గురై , రెప్పపాటులో మృత్యువు నుంచి తప్పించుకున్నారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Former President Donald Trump ).

తుపాకీ శబ్ధం విని ట్రంప్ పోడియం కిందకి చేరి తనను తాను రక్షించుకున్నారు.

దుండగుడు కాల్చిన బుల్లెట్ ఆయన చెవిని తాకుతూ మరో వ్యక్తి గుండెల్లో దిగింది.ఇంత జరిగినా ఏమాత్రం భయపడకుండా ఫైట్ , ఫైట్ అని పిడికిలి బిగించి నినాదాలు చేశారు.

ఆసుపత్రిలో చికిత్స అనంతరం కనీసం రెస్ట్ తీసుకోకుండా వెను వెంటనే ప్రజా జీవితంలో తిరిగి అడుగుపెట్టారు డొనాల్డ్ ట్రంప్.సోమవారం మిల్వాకీలో( Milwaukee ) జరిగిన రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌కు హాజరైన ఆయన.మరింత ఉత్సాహంగా కనిపించారు.2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ను తమ అభ్యర్ధిగా రిపబ్లికన్ పార్టీ అధికారికంగా ప్రకటించింది.దేశ నలుమూలల నుంచి హాజరైన ప్రతినిధులు ట్రంప్ అభ్యర్ధిత్వానికి అంగీకారం తెలిపారు.

దుండగుడి దాడి తర్వాత ట్రంప్ విజయావకాశాలు భారీగా పెరిగాయని సర్వేలు చెబుతున్నాయి.

Advertisement

ఇదిలావుండగా.ఎన్నికల ముందు ట్రంప్‌కు భారీ ఊరట లభించింది.రహస్య పత్రాలకు సంబంధించి ఆయనపై గతంలో నమోదైన కేసును ఫ్లోరిడా కోర్ట్ ( Florida Court )కొట్టివేసింది.ట్రంప్ తరపు న్యాయవాది చేసిన వాదనను పరిగణనలోనికి తీసుకున్న న్యాయస్థానం తగిన విధంగా ఆదేశాలిచ్చింది.2021 జనవరిలో అధ్యక్ష పదవిని కోల్పోయిన అనంతరం ట్రంప్.అమెరికా ప్రభుత్వానికి చెందిన అత్యంత కీలక పత్రాలను ఫ్లోరిడాలోని తన మార్ ఏ లాగో రిసార్ట్‌‌కు తరలించారని ఆరోపణలు ఎదుర్కొన్నారు.

అయితే అధికార మార్పిడి, ట్రంప్ వైట్‌హౌస్‌ను( White House ) ఖాళీ చేసేందుకు సమయం లేకపోవడంతో హడావుడిగా వచ్చేశామని, ఆ టైంలో కొన్ని పత్రాలు ట్రంప్ సామాగ్రిలో కలిసి వుండొచ్చని ఆయన కార్యాలయం అప్పట్లో వివరణ ఇచ్చింది.

అయితే 2022 జనవరిలో ఎఫ్‌బీఐ అధికారులు మార్ ఏ లాగో ఎస్టేట్‌లో( Mar a Lago estate ) సోదాలు చేపట్టారు.ఈ తనిఖీల్లో 15 పెట్టేల్లో 184 పత్రాలు లభ్యమయ్యాయని ఇందులో అత్యంత రహస్య సమాచారం ఉందని అమెరికన్ మీడియా కథనాలను ప్రసారం చేసింది.అదే ఏడాది ఆగస్టులోనూ మరోసారి ట్రంప్ ఎస్టేట్‌పై దాడి చేసిన ఎఫ్‌బీఐ అధికారులు మరోసారి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

అవి 20 పెట్టెలపైనే ఉంటాయని వార్తలు వచ్చాయి.

సస్పెన్స్‌కు తెరదించిన ట్రంప్ .. రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్ధిగా జేడీ వాన్స్
Advertisement

తాజా వార్తలు