నటి మాల్వీ మల్హోత్రా నిజ స్వరూపం ఇదేనా.. ఆ వ్యక్తిని సైతం ఆమె మోసం చేసిందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్లకు ఎప్పుడూ అవకాశాలు వస్తూ ఉంటాయి.అయితే ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లలో సక్సెస్ సాధించిన హీరోయిన్లను వేళ్ల మీడ లెక్క పెట్టవచ్చు.

 Actress Malvi Malhotra Controversy Details Here Goes Viral In Social Media , Ac-TeluguStop.com

తిరగబడరా సామీ సినిమాతో నటి మాల్వీ మల్హోత్రా ( Actress Malvi Malhotra )టాలీవుడ్ ఇండస్ట్రీలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.ఆగష్టు నెల 2వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుండగా రాజ్ తరుణ్ ( Raj Tarun )లవర్ లావణ్య ఇప్పటికే మాల్వీ మల్హోత్రా గురించి సంచలన ఆరోపణలు చేశారు.

హీరోయిన్ మాల్వీ మల్హోత్రా నా కొడుకును మోసం చేసిందంటూ అసిస్టెంట్ ప్రొడ్యూసర్ యోగేశ్ ( Assistant Producer Yogesh )తల్లి సంచలన ఆరోపణలు చేయగా ఆ ఆరోపణలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.మాల్వీపై అసిస్టెంట్ ప్రొడ్యూసర్ యోగేశ్ నాలుగేళ్ల క్రితం కత్తితో దాడి చేయగా ఆ సమయంలో మాల్వీ ఆస్పత్రిలో చేరింది.

యోగేశ్ పెళ్లి చేసుకోమని బలవంతం చేశాడని పెళ్లి ఇష్టం లేదని చెప్పడం వల్లే నాపై దాడి చేశాడని మాల్వీ తెలిపింది.

Telugu Actressmalvi, Controversy, Lavanya, Raj Tarun-Movie

తాజాగా యోగేశ్ తల్లి మాట్లాడుతూ ప్రేమ పేరుతో మాల్వీ మల్హోత్రా నా కొడుకును మోసం చేసిందని చెప్పుకొచ్చారు.ఆమె మా ఆస్తులను లాక్కొని మమ్మల్ని రోడ్డున పడేసిందని యోగేశ్ తల్లి వెల్లడించారు.ప్రేమ పేరుతో వెంటపడుతున్నాడని ఫిర్యాదు చేసి నా కొడుకును అన్యాయంగా జైలుకు పంపిందని యోగేశ్ తల్లి పేర్కొన్నారు.

యోగేశ్ మాల్వీ చాట్ తో పాటు ఫ్లైట్ టికెట్స్ ను యోగేశ్ తల్లి రివీల్ చేయడం గమనార్హం.

Telugu Actressmalvi, Controversy, Lavanya, Raj Tarun-Movie

తన కొడుకు నాలుగేళ్లుగా జైలులోనే ఉన్నాడని యోగేశ్ తల్లి వెల్లడించారు.మాల్వీ మల్హోత్రా ఈ వివాదం గురించి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.మాల్వీ మల్హోత్రా కెరీర్ కు ఈ వివాదాల వల్ల ఇబ్బందేనని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

మాల్వీ గురించి సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube