14 నెలల పాటు నరకం.. ప్రైవేట్ పార్ట్స్ పై దాడి.. షాకింగ్ కామెంట్స్ చేసిన నటి?

సమాజంలో ఆడవారికి రక్షణ కరువవుతోంది.కేవలం సామాన్యులకు మాత్రమే కాకుండా సెలబ్రిటీలకు సైతం ఈ మానసిక వేధింపులు లైంగిక వేధింపులు తప్పడం లేదు.

ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్ లు లైంగిక వేధింపులను, మానసిక వేధింపులను ఎదుర్కొన్న విషయం తెలిసిందే.తాజాగా కూడా బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక నటి లైంగిక వేధింపులను ఎదుర్కొన్నట్లు ఆమె ఆరోపించింది.

ఆమె మరెవరో కాదు బాలీవుడ్ నటి ఫ్లోరా సయాని.ప్రముఖ నిర్మాత తనను తీవ్రమైన లైంగిక వేధింపులకు గురి చేశాడు అంటూ ఆమె సంచలన ఆరోపణలు చేసింది.గత 14 నెలలుగా నరకం అనుభవించానని ఆమె చెప్పుకొచ్చింది.

ప్రముఖ నిర్మాత తనను అత్యంత దారుణంగా హింసిచాడని, ప్రైవేట్ పార్ట్స్‌ను కూడా గాయపరిచాడని వెల్లడించింది ఫ్లోరా సయానీ.ఈ మేరకు తన ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియోను షేర్ చేసింది.

Advertisement

అతని నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడినట్లు ఆమె తెలిపింది.

కాగా తాజాగా ఆమె షేర్ చేసిన ఆ వీడియోలో ఈ విధంగా తెలిపింది.నేను ప్రముఖ నిర్మాతను ప్రేమించాను.అంతలోనే నా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

అతను నన్ను దుర్భాషలాడాడు.అతను నా ముఖం, ప్రైవేట్ భాగాలపై విచక్షణారహితంగా కొట్టాడు.

అతను నా ఫోన్ లాక్కుని బలవంతం చేశాడు.

సమంత నాగచైతన్య విడాకులకు పిల్లలే కారణమా.. అసలు విషయం బయటపెట్టిన చైతన్య?
రహస్యంగా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ సింగర్లు.. ఈ జోడి క్యూట్ కపుల్ అంటూ?

నటన మానేయాలని 14 నెలలుగా చిత్రహింసలు పెట్టాడు.నన్ను ఎవరితోనూ మాట్లాడనివ్వకుండా చేశాడు.చివరికి అతని వద్ద నుంచి తప్పించుకుని పారిపోయి వచ్చాను అని ఆమె తెలిపింది.

Advertisement

అయితే ప్రస్తుతం తాను తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నట్లు తెలిపింది ఫ్లోరా సయానీ.ఆ నరకం నుంచి కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పట్టిందని,నన్ను ఇష్టపడే వారి వద్దకు తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉన్నాను అంటూ ఫ్లోరా తెపిపింది.

ప్రస్తుతం తన తల్లిదండ్రుల వద్ద సంతోషంగా ఉ‍న్నానని వీడియోలో వెల్లడించింది.అయితే ఆ ప్రముఖ నిర్మాత పేరు మాత్రం ఎక్కడా వెల్లడించలేదు సయానీ.

తాజా వార్తలు