Ram Charan Buchi Babu : చరణ్ బుచ్చిబాబు సినిమాను వెంటాడుతున్న ఫ్లాప్ సెంటిమెంట్.. ఆ సెంటిమెంట్ ఈసారైనా బ్రేక్ అవుతుందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏఆర్ రెహమాన్( AR Rahman ) ఎక్కువ సంఖ్యలో సినిమాలకు మ్యూజిక్ అందించారు.

అయితే ఒకటి రెండు సినిమాలు మినహా తెలుగులో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.

చరణ్ ( Ram Charan ) బుచ్చిబాబు( Buchi Babu ) సినిమాను ఈ ఫ్లాప్ సెంటిమెంట్ వెంటాడుతోంది.ఆ సెంటిమెంట్ ఈసారైనా బ్రేక్ అవుతుందా? అని నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.చరణ్ బుచ్చిబాబు సినిమాలో శివరాజ్ కుమార్( Shivaraj Kumar ) కీలక పాత్రలో నటిస్తున్నారు.

తాజాగా శివరాజ్ కుమార్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాపై అంచనాలను పెంచేశారు.బుచ్చిబాబు ఉప్పెనతో తొలి ప్రయత్నంలో భారీ విజయాన్ని సొంతం చేసుకోగా రెండో ప్రయత్నంలో భారీ పాన్ ఇండియా హిట్ ను సొంతం చేసుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

శివరాజ్ కుమార్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా కథ విని మైండ్ బ్లాంక్ అయిందని చెప్పుకొచ్చారు.ఒక మనిషి ఎలా ఆలోచించి ఇలాంటి పాత్ర రాసుకున్నాడో అని అనిపించిందని ఆయన కామెంట్లు చేశారు.గంటన్నర పాటు బుచ్చిబాబు నరేషన్ ఇచ్చారని శివరాజ్ కుమార్ వెల్లడించారు.

Advertisement

శివరాజ్ కుమార్ చెప్పిన విషయాలు బుచ్చిబాబు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ పూజా కార్యక్రమాలు ఈరోజు జరిగినా ఈ సినిమా షూటింగ్ మొదలుకావడానికి చాలా సమయం పడుతుందని తెలుస్తోంది.మైత్రీ నిర్మాతలు, వృద్ధి సినిమాస్ నిర్మాతలు ఈ సినిమా కోసం ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తాయని తెలుస్తోంది.చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ ఇతర భాషల్లో కూడా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది.చరణ్ బుచ్చిబాబులకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు