టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎంతోమంది హీరోలు స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుని ఆ స్టేటస్ తో ఒక వెలుగు వెలగడంతో పాటు తమ నటనతో ఫ్యాన్స్ కు దగ్గరవుతున్నారు.అయితే ఈ హీరోలకు స్టార్ స్టేటస్ దక్కినా హీరోగా నటించిన తొలి సినిమాలు మాత్రం నిరాశకు గురి చేశాయి.
తొలి సినిమాలతో ఫ్లాప్ రిజల్ట్ ను, యావరేజ్ రిజల్ట్ ను అందుకున్న హీరోలు తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ లను అందుకుని ఫ్యాన్స్ కు దగ్గరయ్యారు.
బాల నటుడిగా బాల రామాయణంలో నటించిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ప్రయాణం మొదలుపెట్టారు.
వీఆర్ ప్రతాప్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు.ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచినా స్టూడెంట్ నంబర్1 సినిమాతో తనపై వచ్చిన విమర్శలకు తారక్ చెక్ పెట్టారు.
ఈ సినిమాతోనే దర్శకధీరుడు రాజమౌళి డైరెక్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టారనే సంగతి తెలిసిందే.
స్టార్ హీరో ప్రభాస్ ఫస్ట్ మూవీ ఈశ్వర్ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.
జయంత్ సి పరాన్జీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ ఊరమాస్ లుక్ లో కనిపించగా ఈ సినిమా కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో ఫెయిలైందనే సంగతి తెలిసిందే.వర్షం సినిమాతో ప్రభాస్ ఖాతాలో తొలి బ్లాక్ బస్టర్ చేరింది.
అక్కినేని నాగచైతన్య జోష్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.
దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా నాగచైతన్యకు గట్టి షాకిచ్చింది.వైఎస్సార్ మరణించిన సమయంలో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు.మంచు విష్ణు ఫస్ట్ మూవీ విష్ణు, వరుణ్ తేజ్ ముకుంద, అఖిల్ ఫస్ట్ మూవీ అఖిల్, కళ్యాణ్ రామ్ తొలి చూపులోనే, గోపీచంద్ తొలివలపు సినిమాలు కూడా అంచనాలను అందుకోలేదు.