ఒకే ఒక్క ప్రయాణికుడితో ముంబై నుంచి దుబాయ్ కి బయలుదేరిన విమానం.. ఎందుకంటే..?!

జ‌న‌ర‌ల్‌గా విమానంలో ఎంత మంది ఎక్కుతారు.హా ఎన్ని సీట్లు ఉంటే అన్ని అంటారా.

అంతే లేండి కాక‌పోతే విమానం సైజును బ‌ట్టి ఎన్ని సీట్లు ఉంటే అంత మంది ఎక్కుతారు.కొన్ని విమాన‌ల్లో ఎక్కువ సీట్లు ఉంటే కొన్నింటిలో త‌క్కువ ఉంటాయి.

అయితే ఎప్ప‌డైనా ఒక విమానం ఒక్క ప్ర‌యాణికుడి కోసం న‌డ‌ప‌డం చూశారా.ఏంటి ఒక్క‌డి కోస‌మా? బ‌స్సులే న‌డ‌వ‌వు.అలాంటి ప్లైట్ ఎలా న‌డుస్తుంది అంటారా.

కానీ న‌డిచింది.న‌మ్మ‌డానికి ఆశ్చ‌ర్యంగా ఉన్న ఇదే నిజం.

Advertisement

బుధవారం 360 మంది ప్రయాణికులతో ముంబై నుంచి దుబాయ్‌కు వెళ్లాల్సిన ప్లేన్ జస్ట్.ఒకే ఒక్క ప్రయాణికుడితో బయల్దేరింది.

అయితే చాలామంది ఈ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారంట‌.కానీ స‌మ‌యానికి రాలేదు.

చాలామంది తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడమో, లేదా సెకండ్ కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా రద్దు చేసుకుని ఉండడమో ఇందుకు కారణంగా భావిస్తున్నారు అధికారులు.

మొత్తానికి ఏదేమైనా భవేష్ జవేరి అనే ఒక్క ట్రావెలర్ మాత్రం రాజులాగా విమానం ఎక్కాడు.ఆయన ఎంటర్ కాగానే పైలట్ సహా ఇతర సిబ్బంది చప్పట్లతో అతనికి ఘ‌న స్వాగతం పలికారు.అయితే జవేరి మాత్రం తాను ఒక సాధారణ వ్యక్తినని, వీడియోలు తీసుకునేవాడిని కాద‌రి చెప్పాడు.

ఎన్టీఆర్ నాకన్నా చిన్నోడు... నన్ను మాత్రం ఒరేయ్ అని పిలుస్తాడు : రాజీవ్ కనకాల 
వీడియో వైరల్.. సీతమ్మ మెడలో తాళి కట్టిన ఎమ్మెల్యే.. ఆగ్రహిస్తున్న ప్రజలు

త‌న జీవితంలో ఈ రోజు మాత్రం చాలా స్పెష‌ల్ అని చెప్పాడు.

Advertisement

త‌న జీవితంలో ముంబై నుంచి దుబాయ్ వెళ్తున్న ప్రయాణికుడిని తానొక్కడినే అని, చాలా సంతోషంగా ఉంద‌ని చెప్పాడు.సెక్యూరిటీ సిబ్బంది మినహా ఖాళీగా ఉన్న ముంబై విమానాశ్రయాన్ని ఆయన తన మొబైల్ లో రికార్డు చేశాడు.మూడు గంట‌ల పాటు తానొక్క‌డే ప్ర‌యాణం చేసి దుబాయ్ చేరుకున్నాడు.

పైలట్ కాక్-పిట్ సహా అన్నింటినీ చూపి వాటి వివరాలను జ‌వేరికి వివరించారు సిబ్బంది.ప్ర‌స్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో చెక్క‌ర్లు కొడుతున్నాయి.

తాజా వార్తలు