అమరావతిలో ఫ్లెక్సీల వివాదం నెలకొంది.టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా పార్టీ నేతలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
ఈ నేపథ్యంలోనే టీడీపీ వర్గీయులకు చెందిన పలు షాపులపై టీడీపీ నేతలు జెండాలు కట్టారు.అయితే షాపులపై ఫ్లెక్సీలు, జెండాలు కట్టొద్దని పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు.ఇళ్లపై, షాపులపై జెండాలు కడతామని తెలిపిన కొమ్మాలపాటి తమను ఆపే హక్కు ఎవరికి లేదని స్పష్టం చేశారు.