క్రికెట్ టోర్నమెంట్ జరిగినప్పుడు ఆ మ్యాచ్ కు సంబంధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందజేయడం మామూలే.అది కూడా మన దేశంలో అయితే ఎక్కడైనా క్రికెట్ కు సంబంధించిన క్రీడా పోటీలు నిర్వహిస్తే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కచ్చితంగా అందిస్తారు.
దీంతో వారు పడిన శ్రమకి గుర్తింపుగా క్రీడాకారులు ఉత్సాహంగా ఆడుతారు.ఇక మన దేశవాలి క్రికెట్ మ్యాచ్ లు, అలాగే వన్డేలు, టెస్టులలో విజేతలకు క్యాష్ ప్రైజ్ ఇవ్వడం అందరికీ తెలిసిందే.
ఇక అసలు విషయంలోకి వెళితే… కాశ్మీర్ రాష్ట్రంలోని కుప్వారా లో జరిగిన ఒక స్థానిక టోర్నీలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్న వ్యక్తికి ప్రత్యేక బహుమతి ఇచ్చారు.ప్రత్యేక బహుమతి అంటే ఏదో పెద్ద గిఫ్ట్ అని భావించ వద్దు.కేవలం 2.5 కిలోలు ఉన్న చేపను ఆయనకు గిఫ్ట్ గా అందించారు.అయితే ఈ విషయాన్ని కొందరు సోషల్ మీడియా ద్వారా తెలపగా… ఇలా ఎందుకు చేశారు అంటూ కొందరు నెటిజెన్స్ కామెంట్ చేశారు.దీంతో అసలు విషయం కాస్త బయటికి వచ్చింది.
అదేమిటంటే వారు ఆడుతున్న ప్లే గ్రౌండ్ పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలియ చేయాలని భావించి ఇలా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచిన వ్యక్తి కి ప్రత్యేక గిఫ్ట్ ఇచ్చినట్లు వారు తెలిపారు.
ఇలా చేసి నందునే అందరూ ఈ విషయంపై చర్చిస్తారని, దానితో వారు ఆడే క్రికెట్ మ్యాచ్ లో పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందని తెలియజేశారు.
ఇకపోతే ప్రస్తుతం కాశ్మీర్ రాష్ట్రంలో క్రికెట్ మ్యాచ్లు నిర్వహించే పరిస్థితులు కనబడట్లేదు.అక్కడే ఉన్న ఆటగాళ్ళందరూ తమ సొంత డబ్బులు వేసుకొని మరి టోర్నమెంట్ జరిగేలా చూసుకుంటున్నట్లు అర్థమవుతుంది.
అయితే ఈ ట్వీట్ చూసిన కొందరు వారికి మద్దతుగా నిలిస్తే మరికొందరు ఆ ట్వీట్ కు సరదాగా కామెంట్ జత పరుస్తున్నారు.కొందరైతే మొదటి విన్నర్ కు మటన్, అలాగే సెకండ్ విన్నర్ కు చికెన్ ఇవ్వమని సూచనలు ఇస్తున్నారు.
అయితే ఇలా ప్రత్యేక బహుమతులు ఇవ్వడం మొదటిసారి ఏమి కాదు.అంతర్జాతీయ వేదికల లో కూడా ఇలా కొన్ని సప్రైజ్ గిఫ్ట్ లు ఇచ్చారు.
ఇదివరకు 2017 లో శ్రీలంకతో జరిగిన ఓ సిరీస్ లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కు ఎన్నికైన టీమిండియా పేసర్ మినీ ట్రక్ ను అందజేశారు.