ఉత్తర కొరియాలో మొదటి కరోనా కేసు... అక్కడా మొదలైన టెన్షన్...!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అన్ని దేశాలలో వ్యాప్తి చెందిన కూడా ఆ ప్రాంతంలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు అవ్వలేదు.

కానీ, ప్రస్తుతం ఆ ప్రాంతంలో కూడా కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యింది.

ఆ ప్రాంతం ఏమిటా అని ఆలోచిస్తున్నారా.? అదేనండి ఉత్తర కొరియా దేశం.ఉత్తర కొరియా లో తాజాగా తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు అయినట్లు అధికారికంగా ఆ ప్రభుత్వం తెలియజేసింది.

ఒక వ్యక్తి కి కరోనా అనుమానిత లక్షణాలు ఉండడంతో పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఉత్తర కొరియా ప్రభుత్వం తెలియజేసింది.దేశ సరిహద్దులో ఉన్న కేసాంగ్ నగరంలో పాజిటివ్ కేసు నమోదు అవడంతో వైరస్ వ్యాప్తి చెందకుండా దేశ ప్రభుత్వం ఆ ప్రాంతంలో లాక్ డౌన్ విధానాన్ని అమలులోకి తెచ్చారు.

దింతో వైరస్ నిర్ధారణ అయిన వ్యక్తి అక్రమంగా సరిహద్దు దాటి దక్షిణ కొరియాకు వెళ్లి వచ్చినట్లు సమాచారం.ఇది ఇలా ఉండగా మరోవైపు దేశంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు అవడంతో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ అధికారులతో సమీక్ష నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

అలాగే కరోనా లక్షణాలు ఏ ఒక్కరిలో కనిపించిన కూడా పరీక్షలు నిర్వహించి అందుకు తగ్గ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.మూడు నెలల కిందట దక్షిణ కొరియాకు వెళ్ళిన ఓ వ్యక్తి ఈ నెలలో అక్రమంగా సరిహద్దులు దాటి పట్టణంలోకి ప్రవేశించడంతో, నిర్ధారణ అయిందని అధికారికంగా మీడియా ద్వారా తెలిపారు.

మరోవైపు ఉత్తర కొరియా దేశ వ్యాప్తంగా మొత్తం 972 పరీక్షలు నిర్వహించామని ఏ ఒక్కరికి కూడా కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అవ్వలేదని అధికారులు తెలిపారు.అలాగే కరోనా లక్షణాలతో బాధ పడే వారిని 25,551 మందిని క్వారంటైన్ లో ఉండమని తెలిపామని అధికారులు తెలిపినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు