కరోనా నుండి కోలుకున్న పూజా హెగ్దే..!

కరోనా సెకండ్ వేవ్ సినీ సెలబ్రిటీస్ లను సైతం ఎటాక్ చేస్తుంది.ఈమధ్యనే బుట్టబొమ్మ పూజా హెగ్దే కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని వెళ్లడించింది.

తనకు పాజిటివ్ అని తేలగానే హోం క్వారెంటైన్ లో ఉంటూ మెడిసిన్స్ తీసుకున్న పూజా హెగ్దే ఫైనల్ గా మహమ్మారి నుండి బయటపడ్డది.పూజా హెగ్దే కరోనా నెగటివ్ రిపోర్ట్ వచ్చిందని చెప్పింది.

ఈ న్యూస్ తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కు ఊపిరి పీల్చుకునేలా చేసింది.తన గురించి ప్రాధనలు చేసిన అందరికి ధన్యవాదాలు అంటూ పూజా హెగ్దే మెసేజ్ పెట్టింది.

అంతేకాదు మీ విషెస్ ఎనర్జీని ఇచ్చాయని.ఓ మ్యాజిక్ చేశాయని అంటుంది పూజా హెగ్దే.

Advertisement

ఫర్ ఎవర్ గ్రేట్ ఫుల్ అంటూ స్టే సేఫ్ అని కామెంట్ పెట్టింది పూజా హెగ్దే.మొత్తానికి బుట్టబొమ్మ కరోనా నుండి క్షేమంగా బయటపడ్డది.

ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యాం, అఖిల్ బ్యాచ్ లర్ సినిమాలు చేస్తున్న పూజా హెగ్దే ఆ సినిమాతో మరోసారి ఆడియెన్స్ ను అలరించాలని చూస్తుంది.అంతేకాదు సూపర్ స్టార్ మహేష్, త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమాకు కూడా పూజా హెగ్దేని హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్టు టాక్.

సినిమాలో పూజా హెగ్దే ఉంటే స్పెషల్ ఎట్రాక్షన్ ఉన్నట్టే లెక్క.అందుకే ఆమె వెంట దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు.

ఛీ.. ఛీ.. ట్రక్కులో ఇరుక్కుపోయిన వ్యక్తిని కాపాడాల్సింది పోయి.. చివరకు?
Advertisement

తాజా వార్తలు