అఫిషియల్ : బరిలోకి దిగిన సూపర్ స్టార్.. ఈ రోజే కొత్త షెడ్యూల్ స్టార్ట్!

సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu )ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ”గుంటూరు కారం”( Guntur karam ).సర్కారు వారి పాట వంటి హిట్ తర్వాత మహేష్ బాబు మరో సినిమాను రిలీజ్ చేయలేదు.

 Finally Guntur Kaaram Gets Back To The Sets , Guntur Kaaram, Mahesh Babu, Trivik-TeluguStop.com

లాంగ్ గ్యాప్ తో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన మహేష్ ఈసారి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ( S Radhakrishna )భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.ఇక ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి తర్వాత షూట్ స్టార్ట్ చేసుకుంది.

కానీ అప్పటి నుండి ఏదొక అడ్డంకి వస్తూనే ఉంది.ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ తో అంచనాలు పెంచేసింది.ఇక ఇప్పుడు కొత్త షెడ్యూల్ గురించి మేకర్స్ అఫిషియల్ అప్డేట్( Makers Official Update ) ఇచ్చారు.సమ్మర్ లో ఆగిపోయిన ఈ షెడ్యూల్ ఇప్పటికి స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది.

ఈ మేరకు మేకర్స్ అఫిషియల్ అనౌన్స్ చేసారు.గుంటూరు కారం కొత్త షెడ్యూల్ ను ఈ రోజు నుండి స్టార్ట్ చేసినట్టు సూపర్ స్టార్ మహేష్ బాబు బరిలోకి దిగినట్టు అనౌన్స్ చేసారు.

జూన్ 24 నుండి మహేష్ మళ్ళీ రంగంలోకి దిగినట్టు కన్ఫర్మ్ చేయడంతో ఈ షెడ్యూల్ ఎట్టకేలకు స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది.మరో ఇది లాంగ్ షెడ్యూల్ కాగా ఒక చిన్న బ్రేక్ తో నాన్ స్టాప్ గా కొనసాగుతుందట.

చూడాలి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారో లేదో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube