తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి అస్తవ్యస్తంగా మారిన సంగతి తెలిసిందే.పార్టీ సీనియర్ నాయకులంతా తీవ్ర అసంతృప్తికి గురవడం, పార్టీలో తమకు ప్రాధాన్యం దక్కడం లేదని , కొత్తగా పార్టీలోకి వచ్చి చేరిన వారికి కీలక పదవులు దక్కుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేస్తూ, అలక చెందిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో సీనియర్ నాయకులంతా మూకమ్మడిగా పార్టీకి రాజీనామా చేసి మరో పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారనే వార్తలతో అధిష్టానం ఉలిక్కిపడింది.ఈ క్రమంలోని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ సింగ్ ను తెలంగాణలో పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రత్యేకంగా నియమించింది.
రెండు రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితిపై ఆరా తీస్తూ , పార్టీలోని అసంతృప్త నాయకులతోనూ ప్రత్యేకంగా సమావేశం అవుతూ, వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.అసలు ఎందుకు సీనియర్లు జూనియర్ల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి ? అసలు తప్పంతా ఎక్కడ జరుగుతుంది అనే విషయాలపై దిగ్విజయ్ సింగ్ ప్రత్యేకంగా నాయకులందరినీ అడిగి తెలుసుకున్నారు .
ఈ సందర్భంగా సీనియర్ నాయకులు అంతా రేవంత్ రెడ్డి తో పాటు, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం టాగూర్ పైన ఫిర్యాదులు చేయడం , అలాగే రేవంత్ రెడ్డి అభిప్రాయాలు సేకరించిన సందర్భంగా, సీనియర్లు తనతో సఖ్యతగా ఉండడం లేదని , అన్ని విషయాలలోను విభేదిస్తున్నారని ఆయన దిగ్విజయ్ సింగ్ కు తెలపడం తదితర అంశాలపై ప్రత్యేకంగా ఒక నివేదికను తయారు చేసుకున్నారు .ఈ నివేదికను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున కర్గే తో పాటు , ఏఐసిసి పెద్దలకు అందించబోతున్నట్లు సమాచారం ఈ నివేదికలో కొన్ని అంశాలు పూర్తిగా పరిశీలించిన తర్వాత, కాంగ్రెస్ పెద్దలు కీలక నిర్ణయాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు పేర్కొంటున్నాయి.ఏఐసిసి రాష్ట్ర ఇంచార్జిగా సీనియర్ నాయకుడు నియామకంతో సహా, నేతల మధ్య సయోధ్యకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని దిగ్విజయ్ ఈ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.ఇప్పటికే ఈ నివేదిక తుది రూపం ఇచ్చేందుకు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్ , కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ముగ్గురు ఏఐసిసి ఇన్చార్జి కార్యదర్శులతోనూ దిగ్విజషన్ చర్చించినట్లు సమాచారం.
ఏడాదిన్నర నుంచి నేతల మధ్య సఖ్యత లేకపోవడంతోనే ఉప ఎన్నికల్లోనూ, పార్టీ క్యాడర్ పైనా తీవ్ర ప్రభావం చూపించినట్లుగా దిగ్విజయ సింగ్ అభిప్రాయపడుతున్నారట.

పార్టీలో అస్తవ్యస్తంగా పరిస్థితులు ఉండడంతోనే కాంగ్రెస్ వీడి ఇతర పార్టీలో చేరేందుకు ఎక్కువగా నేతలు మొగ్గు చూపుతున్నారని ఆయన అంచనా వేశారట.ముఖ్యంగా రేవంత్ రెడ్డి తో పాటు, మాణిక్యం ఠాగూర్ పైన సీనియర్ నాయకులకు నమ్మకం లేకపోవడంతోనే పరిస్థితి ఇంత వరకు వచ్చిందని , దీనిపైన ప్రత్యేకంగా నివేదిక తయారు చేసినట్లు సమాచారం.
.