సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో స్లిమ్ గా ఉన్న హీరోయిన్లు మాత్రమే సక్సెస్ అవుతారని చాలామందిలో భావన ఉంది.అయితే ఆ భావనను బ్రేక్ చేసిన హీరోయిన్లలో రాశీఖన్నా ఒకరు.
స్టార్ హీరోలకు, మిడిల్ రేంజ్ హీరోలకు జోడీగా నటించిన రాశీఖన్నా అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా కెరీర్ పరంగా ఎదిగారు.ఇప్పటికీ రాశీఖన్నా చేతిలో అడపాదడపా మూవీ ఆఫర్లు ఉండగా ఆ ఆఫర్లే ఈ బ్యూటీ కెరీర్ ను డిసైడ్ చేయనున్నాయి.
అయితే రాశీఖన్నా తన సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను రిజెక్ట్ చేశారు.ఒకవేళ రాశీఖన్నా ఈ సినిమాలలో నటించి ఉంటే మాత్రం ప్రస్తుతం ఆమె వేరే లెవెల్ లో ఉండేవారని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్ల గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.
విజయ్ దేవరకొండ సినీకెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో గీతా గోవిందం సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో ఛాన్స్ వచ్చినా రాశీఖన్నా వేర్వేరు కారణాల వల్ల ఈ మూవీ ఆఫర్ ను వదులుకున్నారు.
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన రాక్షసుడు సినిమాలో హీరోయిన్ గా రాశీఖన్నాకు ఛాన్స్ వచ్చినా కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను కూడా ఆమె వదులుకోవడం జరిగింది.అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఎఫ్2 మూవీలోని మెహ్రీన్ రోల్ ను కూడా రాశీఖన్నా రిజెక్ట్ చేశారని బోగట్టా.

శర్వానంద్ మహానుభావుడు, నాగచైతన్య మజిలీలోని సెకండ్ హీరోయిన్ రోల్ కూడా రాశీఖన్నా రిజెక్ట్ చేశారని బోగట్టా.సర్కారు వారి పాట సినిమాలో మాత్రం రాశీఖన్నాకు ఛాన్స్ వచ్చినట్టే వచ్చి పోయిందని తెలుస్తోంది.తమిళంలో తెరకెక్కిన మానాడు, భూమి సినిమాలను కూడా రాశీఖన్నా వదులుకున్నారని బోగట్టా.ఈ సినిమాలలో నటించి ఉంటే మాత్రం రాశీఖన్నా ప్రస్తుతం పూజా హెగ్డే, రష్మిలకు పోటీ ఇచ్చే స్థాయిలో అయితే ఉండేవారు.







