Pawan Kalyan Charmy : బర్త్‌డే పార్టీలో పవన్, ఛార్మిల మధ్య పెద్ద గొడవ…ఎందుకు అయిందో తెలుసా…?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక అగ్ర హీరో అని చెప్పుకోవచ్చు.అతడి అన్నయ్య చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగాడు.

 Fight Between Pawan Kalyan And Charmi-TeluguStop.com

ప్రతిభ, కృషి, కష్టంతోనే వీరు ఆ స్థాయికి వచ్చారు.అందువల్ల తెలుగు సినిమా పరిశ్రమలో వారి పట్ల ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది.

ఎంత ఎత్తుకు ఎదిగినా వీరు మాత్రం ఇతరులను చులకన చేసి ఎప్పటికీ మాట్లాడరు.చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు వీరందరూ కూడా సినిమా ఇండస్ట్రీలోని అందరినీ బాగా చూసుకుంటారు.

అవసరమైతే సహాయం చేసేందుకు కూడా ముందుకు వస్తారు.అయితే తమకు వ్యతిరేకం చేసి ఎవరైనా నెగిటివ్ గా మాట్లాడితే మాత్రం తాటతీస్తారు.

Telugu Charmy Kaur, Chiranjeevi, Naayak, Pawan Kalyan, Ram Charan, Tollywood-Mov

చిరంజీవి( Chiranjeevi ) ఈ విషయాలను పెద్దగా పట్టించుకోకపోయినా మెగా బ్రదర్ నాగబాబు, పవన్ కళ్యాణ్ బాగా రియాక్ట్ అవుతుంటారు.అయితే మాస్, అనుకోకుండా ఒకరోజు, లక్ష్మీ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఛార్మి( Charmy Kaur ) మెగా ఫ్యామిలీతో కయ్యానికి కాలు దువ్వింది.గతంలో ఒక స్టార్ హీరో పుట్టినరోజు పార్టీకి హాజరైన ఈ తార మెగా ఫ్యామిలీని కించ పరుస్తూ మాట్లాడిందట.ఆ సమయంలో ఈ ముద్దుగుమ్మ బాగా డ్రింక్ చేసి ఉందని అంటారు.

ఆ మత్తులో మెగా ఫ్యామిలీ గురించి ఆమె నోరు పారేసుకుందని, అది తెలిసి పవన్ కళ్యాణ్ చాలా ఫీల్ అయ్యాడని అప్పట్లో సినీ వర్గాల్లో ప్రచారం నడిచింది./br>

Telugu Charmy Kaur, Chiranjeevi, Naayak, Pawan Kalyan, Ram Charan, Tollywood-Mov

పవన్ కళ్యాణ్ చాలా ఆవేశం ఉన్న వ్యక్తి .అందువల్ల తన ఫ్యామిలీని అన్యాయంగా తిడుతుంటే చూడలేకపోయాడట.అందుకే ఛార్మి వద్దకు వెళ్లి కాస్త రూడ్ గా మాట్లాడట.

ఛార్మి కూడా అదే స్థాయిలో రెస్పాండ్ కావడంతో వీరి మధ్య గొడవ చాలా పెద్దదైందట.చివరికి పక్కనే ఉన్నవారు వారి మధ్యలో కలగజేసుకొని ఆపే పరిస్థితి వచ్చిందట.

ఈ గొడవ తర్వాత ఛార్మితో పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా మెగా ఫ్యామిలీ లో ఎవరూ కూడా మాట్లాడలేదని అంటారు.అందుకేనేమో ఈ మిల్కీ బ్యూటీతో కలిసి ఏ మెగా హీరో కూడా నటించింది లేదు.

పవన్ కళ్యాణ్, ఛార్మి కాంబోలో సినిమా రాకపోవడానికి ఈ గొడవే కారణమని చెప్పేవారు కూడా చాలామంది ఉన్నారు.ఇక 2013 లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన నాయక్ సినిమా( Naayak )లో చార్మి ఒక ఐటమ్ సాంగ్ చేసింది.ఆ సినిమా తప్ప ఆమె ఏ ఇతర మెగా హీరో సినిమాలో కనిపించలేదు.2015 తర్వాత నటించడం మానేసింది ప్రొడ్యూసర్ గా మాత్రమే కొనసాగుతోంది.నిర్మాతగాను ఆమెను చాలా ఫ్లాప్స్ పలకరిస్తున్నాయి.అందువల్ల కెరీర్ లైఫ్ లో ఆమె చాలా ఒడిదుడుగులను ఎదుర్కొంటోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube