తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త కమిటీల నియామకం కాక రేపుతోంది. ఈ నియామకాలపై పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు.
టీ-కాంగ్రెస్ సీనియర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గా రెడ్డి, దామోదర రాజనరసింహ, మధుయాష్కీ గౌడ్, ప్రేంసాగర్ తదితరులు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసంలో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వగా అసలు కాంగ్రెస్ నేతలకు చుక్కెదురైందని సీనియర్లు అభిప్రాయపడ్డారు. “ఇది అసలు కాంగ్రెస్ వర్సెస్ వలస కాంగ్రెస్ మధ్య పోరు అని. 108 నియామకాల్లో 54 మంది టీడీపీ, ఇతర పార్టీలకు చెందిన వారున్నారు. ఇది ఎలా సాధ్యం? ఇది మంచి సంకేతం కాదు, కొత్త నియామకాలతో టీ-కాంగ్రెస్ చాలా నష్టపోతుంది. సేవ్ కాంగ్రెస్నినాదంతో వెళ్లాలని నిర్ణయించుకున్నామని, కాంగ్రెస్ హైకమాండ్‌తో సమావేశమై కొత్తగా నియమితులైన నేతల గురించి, వారి గత చరిత్ర గురించి తెలియజేస్తాం.
అంతర్గత ప్రజాస్వామ్యం కాంగ్రెస్‌లో భాగమే కానీ నాయకులను నియమించడంలో నేనెప్పుడూ పక్షపాతం చూపలేదు’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి నిజమైన విధేయుడిగా పేరుగాంచిన భట్టి విక్రమార్క కూడా కొత్త నియామకాల్లో పొరపాట్లు ఉన్నట్లుగా అంగీకరించారు.
“కొత్త కమిటీలు సరికావని అంగీకరిస్తున్నాను.చాలా మంది నాయకులు నిరాశతో ఉన్నట్లుగా నా దృష్టికి తీసుకువచ్చారు.
వారిని చూసి నేను కలత చెందాను మరియు బయటి వ్యక్తుల నుండి కాంగ్రెస్ పార్టీని కాపాడాలని మేము సమిష్టిగా నిర్ణయించుకున్నాము” అని భట్టి విక్రమార్క అన్నారు.

టీ-కాంగ్రెస్ కొత్త నాయకత్వం తమ అనుచరులతో పార్టీని కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని, దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని మరికొందరు నేతలు పేర్కొన్నారు. టీ-పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కొందరు నేతలు కోవర్టుగా ఖండించారు. “మేము అనేక పార్టీలు మారి కాంగ్రెస్ పార్టీలో చేరలేదు.
మేం కాంగ్రెస్‌లో పుట్టాం, కాంగ్రెస్‌లోనే చనిపోతాం’’ అని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ అన్నారు.మొత్తానికి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆయన ఆధిపత్యాన్ని తగ్గించగలరా? కాంగ్రెస్ అధిష్టానం రేవంత్‌కి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు కనిపిస్తోంది.ముందు ముందు ఈ వివాదం మరింతగా ముదిరే అవకాశం కినిపిస్తుంది.