సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ ఎస్సీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిన ఘటన కలకలం సృష్టించింది.పాఠశాలలో సుమారు పదకొండు మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు.
ఖర్జూర పండ్లు తినడంతో అస్వస్థతకు గురి అయ్యారని తెలుస్తోంది.గమనించిన పాఠశాల సిబ్బంది బాధిత విద్యార్థులను హుజుర్ నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం విద్యార్థులను చికిత్స కొనసాగుతోంది.అయితే కాల పరిమితి దాటిన ఖర్జూర పండ్లను తినడమే కారణమని వైద్యులు అనుమానిస్తున్నారు.







