ఈ మధ్యకాలంలో సినీ సెలెబ్రెటీలు వారు నటించిన సినిమాలు కనుక విడుదల అవుతూ ఉంటే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.అయితే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ఎంతో విభిన్నంగా నిర్వహిస్తూ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా రవితేజ శ్రీ లీల హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ధమాకా.ఈ సినిమా డిసెంబర్ 23వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం నగరమంతా పర్యటిస్తూ అభిమానులను కలవడమే కాకుండా అభిమానులతో కలిసి సరదాగా ముచ్చటిస్తూ డాన్సులు చేస్తూ పెద్ద ఎత్తున సినిమాని ప్రజలలోకి తీసుకెళ్తున్నారు.
ఈ క్రమంలోనే నటి శ్రీ లీల తాజాగా హైదరాబాదులో ఒక థియేటర్లో సందడి చేశారు.థియేటర్లో ధమాకా అడ్వాన్స్ టికెట్లను అమ్ముతూ ఈమె సందడి చేశారు.మొదటగా థియేటర్లో అభిమానులతో కలిసి డాన్స్ చేసిన ఈమె అనంతరం టికెట్ కౌంటర్ కి వెళ్లారు.

ఇలా టికెట్ కౌంటర్లో ఈమె టికెట్లు అమ్ముతూ కనిపించడంతో పెద్ద ఎత్తున అభిమానులు టికెట్లు కొనుగోలు చేయడమే కాకుండా ఈమెతో కలిసి సెల్ఫీలు దిగడానికి కూడా ఎగబడ్డారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇకపోతే ఈ సినిమాకి త్రినాథ్ రావు దర్శకత్వం వహించారు.
క్రాక్ సినిమా తర్వాత రవితేజ నటించిన కిలాడి రామారావు ఆన్ డ్యూటీ వంటి సినిమాలు పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయాయి.అయితే ఎన్నో అంచనాల నడుమ ధమాకా సినిమా డిసెంబర్ 23వ తేదీ విడుదల కానుంది.
మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది.







