ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం పెరిగింది.ఇంటర్నెట్‌లో చాలా రకాల ఫన్నీ వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి.
ఇంటర్నెట్‌లో జంతువులకు చెందిన ఫన్నీ వీడియోలను చూస్తుంటాం.ఇటీవల కాలంలో యజమానులు తన పెంపుడు జంతువులతో తీసే ఫన్నీ వీడియోలు మిలియన్ల వ్యూవ్స్ సొంతం చేసుకుంటున్నాయి.
అలాంటి కోవకు చెందిన ఓ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.సైలెంట్‌గా ఉన్న ఇద్దరు పిల్లుల మధ్య ఓ కాకి చేసిన పనికి నెటిజన్లు నవ్వుకుంటున్నారు.
మనుషుల వలే.జంతువులు కూడా సంతోషాన్ని, కోపాన్ని చూపిస్తాయి.తమ హావాభావాలను చూపించడానికి స్వంత మార్గాన్ని ఎంచుకుంటాయి.అయితే రెడ్డిట్‌లో ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది.ఈ వీడియోను మనం ఒకసారి చూసినట్లయితే.రోడ్డుపై ఇద్దరు పిల్లులు ఎదురుపడ్డాయి.
అయితే ఈ రెండు పిల్లులు పోరాడటానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది.కానీ ఫైట్ చేయకుండా.
అటు ఇటూ తిరుగుతుంటాయి.ఇంతలో ఓ కాకి అక్కడికి వస్తుంది.
కాకి ఓ పిల్లిని తన ముక్కుతో పొడుస్తుంది.
దీంతో ఇద్దరు పిల్లుల మధ్య పోరు మొదలవుతుంది.కొంచెం సేపు పోరాడిన తర్వాత మళ్లీ పిల్లలు సైలెంట్ అవుతారు.ఇంతలో కాకి మళ్లీ ఎంటర్ అవుతుంది.
మళ్లీ పిల్లిని పొడుస్తుంది.దీంతో పిల్లులిద్దరూ మళ్లీ తన యుద్ధాన్ని కంటిన్యూ చేస్తాయి.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.వీడియో చూసిన ప్రతిఒక్కరూ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.
నారదుడిలా కాకి ఇద్దరు పిల్లుల మధ్య పుల్లలు పెట్టిందంటున్నారు.కాకులు ఎంతో తెలివైనవని, ఎంతో చాకచక్యంగా పిల్లుల మధ్య నిప్పు పెట్టిందన్నారు.
కాగా, కాకుల్లాగానే మనుషుల్లో కూడా ఇలాంటి వాళ్లు ఉంటారని, స్నేహితుల రూపంలో మన పక్కనే ఉంటారని, అన్ని విషయాలు తెలుసుకుని మన మధ్యనే గొడవలు పెడతారని ఓ నెటిజన్ తెలిపాడు.