బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన ప్రియాంక చోప్రా 2018లో అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్ నుప్రేమించి పెళ్లి చేసుకున్నారు.అయితే ఈమె వివాహం జరిగిన తర్వాత ఈ దంపతులు అమెరికాలో లాస్ ఏంజెల్స్ నివాసం ఉంటున్నారు.
వివాహం అయినప్పటి నుంచి ఈమె ఒక్కసారి కూడా ఇండియాకి తిరిగి రాలేదు.ఇలా దాదాపు మూడు సంవత్సరాలకు పైగా అమెరికాలోనే ఉంటున్నటువంటి నటి తాజాగా ఇండియాకి వచ్చారు.
దాదాపు మూడు సంవత్సరాలకు పైగా ఇండియాకు దూరమైనటువంటి ప్రియాంక చోప్రా సోమవారం రాత్రి ముంబై ఎయిర్ పోర్టులో దర్శనం ఇవ్వడంతో ఒక్కసారిగా అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేశారు.చాలా రోజుల తర్వాత తమ అభిమాన నటిని నేరుగా చూడటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.
అలాగే ప్లకార్డులు పట్టుకొని ప్రియాంక చోప్రాకు ఘన స్వాగతం పలికారు.ఈమె తన భర్త తన కుమారుడితో కూడా ముంబైకి చేరుకున్నారు.ఇండియాకు ఈమె దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో అన్ని విషయాలను పంచుకుంటూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేసేవారు.

ఈ క్రమంలోనే తాను ఇండియా వచ్చే విషయాన్నీ కూడా ఈమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నారు.మొత్తానికి చాలా కాలం తర్వాత నటి ఇండియాకు రావడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఈమెను చూడటం కోసం తరలివచ్చారు.2017 వ సంవత్సరంలో ప్రియాంక చోప్రా బేవాచ్ సినిమాతో హాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.అయితే అక్కడే ఈమె నిక్ జోనాస్ తో ప్రేమలో పడి ఎక్కువ కాలం పాటు తన ప్రేమ విషయాన్ని దాచి పెట్టకుండా వెంటనే పెళ్లి చేసుకొని సరోగసి విధానంలో ఒక బిడ్డకు జన్మనిచ్చారు.ఇదివరకు తన బిడ్డకు సంబంధించిన ఎన్నో ఫోటోలను ఈమె సోషల్ మీడియా వేదికగా కూడా షేర్ చేశారు.







