అభంశుభం తెలియని మూడు నెలల చిన్నారి పసికందును విక్రయించిన కన్న తండ్రి..

శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రగతి సాధించిన నేటి రోజుల్లోనూ ఆడపిల్లలు అంగట్లో బొమ్మల్లా విక్రయాలకు గురవుతూనే ఉన్నారు.తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరిలో ఓ అభంశుభం తెలియని మూడు నెలల చిన్నారి పసికందును తన కన్న తండ్రే పోషించలేక డెబ్బై వేల రూపాయలకు విక్రయించిన వ్యవహారాన్ని పసికందు అమ్మమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో మంగళగిరి పట్టణ పోలీసులు ఛేదించారు.

 Father Sells Three Months Old Baby In Mangalagiri Details, Father, Father Sells-TeluguStop.com

ఈ సందర్భంగా పట్టణ పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ జె.రాంబాబు వివరాలను వెల్లడించారు.ఆయన మాట్లాడుతూ కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి తన కూతురు పట్ల పోషించేందుకు స్థోమత లేక కర్కశంగా వ్యవహరించాడు.పుట్టిన మూడు నెలలకే చిన్నారిని 70 వేల రూపాయలకు అమ్మేసి సమాజానికి మాయని మచ్చ మిగిల్చాడు, మరికొంతమంది వ్యక్తులు పేదరికాన్ని అవకాశం గా మలుచుకొని ఆడ శిశువు పై వచ్చినకాడికి సొమ్ము చేసుకుంటూ ఆరుగురు వ్యక్తులు చేతులు మార్చి విక్రయించారు.

వివరాల్లోకి వెళితే మంగళగిరి నగరంలోని గండాలయపేటకు చెందిన మెడబలిమి మనోజ్ అనే వ్యక్తి కి గతంలోనే ఇద్దరు కుమార్తెలు కలరు.ఈ నేపథ్యంలో గత మూడు నెలల క్రితం అతని భార్య మరో ఆడపిల్లకు జన్మనిచ్చింది.

అయితే మనోజ్ గతంలోనే తనకు ఇద్దరు కుమార్తెలు ఉండటంతో మూడవ పాపను పోషించలేక విక్రయించేందుకు సిద్ధపడ్డాడు.అనుకున్నదే తడవుగా అదే ప్రాంతానికి చెందిన మిక్కిలి నాగలక్ష్మి అనే మహిళ సహాయంతో నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కొండప్రోలు గ్రామానికి చెందిన మేఘావత్ గాయత్రి అలియాస్ సరస్వతి అనే మహిళకు రూ.70వేలకు విక్రయించారు.అనంతరం చిన్నారిని కొనుగోలు చేసిన ఆమె మరో మహిళ భూక్యా నందు అలియాస్ గగులూత్ నందు అనే మహిళకు రూ.1,20,000/-లకు విక్రయించింది.భూక్యానందు కూడా చేతులు మార్చి హైదరాబాద్ దిల్ షుక్ నగర్ కు చెందిన ఎస్.కే.నూర్జహాన్ @నేహా అనే మహిళకు రూ.1,87,000/-లకు విక్రయించారు.

Telugu Dsp Rambabu, Sells Baby, Baby, Guntur, Mangalagiri, Urbansp-Latest News -

నూర్జహాన్ తిరిగి హైదరాబాద్ కు చెందిన బొమ్మాడ ఉమాదేవి అనే మహిళకు రూ.1,90,000/-లకు విక్రయించారు.మరోసారి బొమ్మాడ ఉమాదేవి కూడా తాను కొనుగోలు చేసిన చిన్నారిని విజయవాడ బెంజిసర్కిల్ కు చెందిన పడాల శ్రావణికి రూ.2,00,000/-లకు విక్రయించింది.పడాల శ్రావణి తాను కొనుగోలు చేసిన చిన్నారి ని విజయవాడ గొల్లపూడికి చెందిన గరికముక్కు విజయలక్ష్మి అనే వివాహిత మహిళకు రూ.2,20,000/-లకు విక్రయించగా ఆమె తూర్పు గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన వర్రె రమేష్ అనే వ్యక్తికి రూ.2,50,000/-లకు విక్రయించింది.చిన్నారి విక్రయంపై గుంటూరు జిల్లా అర్భన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఉత్తర్వుల మేరకు డీఎస్పీ జె.రాంబాబు సారథ్యంలో మంగళగిరి టౌన్ సీఐ బి.అంకమ్మరావు పర్యవేక్షణలో ఎస్.ఐ.ఇ.నారాయణ తన సిబ్బంది సహాయంతో నిందితులను చాకచక్యంగా పట్టుకుని మూడు నెలల పసికందును సురక్షితంగా కాపాడి సంరక్షణ నిమిత్తం తిరిగి తల్లిదండ్రులకు అప్పగించారు.కేసులో ప్రతిభకనబర్చిన పోలీస్ అధికారులకు, సిబ్బందికి అర్భన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ రివార్డులను ప్రకటించారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube