రైతన్న విందు భోజనం... అంబలి, రొట్టె, పాయసం! ఎక్కడ, ఎందుకు?

సాధారణంగా ఎక్కడ చూసుకున్నా ఏ పెళ్లిల్లో, పండగలప్పుడో అతిధులకు భోజనాలు పెట్టడం అనేది మనం ఆనవాయితీగా చూస్తున్నాం.అలాంటి సందర్భాలు వచ్చినపుడు ఊరిలో వున్నవారికి, చుట్టుపక్కల ఊళ్ళల్లో వున్న బంధువులకి, దూర బంధువులందరికీ ఇంటికి పిలిచి విందు భోజనం అనేది ఏర్పాటు చేస్తూ వుంటారు.

 Farmers Dinner Ambali, Bread, Payasam Where And Why ,viral Latest, News Viral,-TeluguStop.com

అయితే కర్నాటక రాష్ట్రంలో( Karnataka ) మాత్రం ఓ రైతు తమ వారందరికీ ఇలాంటి సందర్భం ఏది లేకుండానే రుచికరమైన భోజనం పెట్టాడు.పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఆహ్వానం పంపి మరీ భోజనం పెట్టడం ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఈ అరుదైన ఘటన విజయపూర్ నగర్( Vijaypur Nagar ) శివార్లలోని రంభాపుర గ్రామం( Rambhapura village )లో చోటు చేసుకుంది.ఈ గ్రామంలో మంచి వర్షాలు పడినా, రైతులకు సమృద్ధిగా పంటలు పండినా, గ్రామస్తులకు రోగాలు వచ్చి నయం అయినా.ఇలాంటి ఆచారాలు అనేవి ఎక్కువగా కనిపిస్తాయట.ఈ గ్రామంలో మెండెగర కుటుంబం.ఏటా పండిన పంటను కోసి దేవుడికి సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది.ఇక్కడ పంటలు పండిన వెంటనే వాటిని వినియోగించకుండా నేరుగా మార్కెట్ కు తీసుకొచ్చి దేవుడికి సమర్పిస్తుంటారు.

ఈ క్రమంలో వంటలలో భాగంగా అంబలి, రొట్టె, పాయసం వంటివి తయారు చేసి దేవుడికి నైవేద్యంగా పెడతారు.

ఈ క్రమంలోనే అక్కడ అంబలి, ఖడక్ రోటీ, సజ్జకా లేదా పాయసం, వేరుశెనగ చట్నీ, వంకాయ పల్య, పప్పుల పల్యాతో సహా వివిధ రకాల ఆహారాన్ని మట్టి పాత్రాల్లో పెట్టి.హనుమంతుడికి నైవేద్యంగా సమర్పిస్తారు.ఆ తరువాత అక్కడికి వచ్చిన అతిధులకు సదరు ఆహార పదార్ధాలను ఎంతో వడ్డిస్తూ వుంటారు.

పంట పండితేనే కదా రైతుకు నిజమైన పండగ అనుకొని అక్కడికి వచ్చినవారు ఆనందంతో భోజనం సేవిస్తారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube