పార్టీలకు అతీతంగా ఇప్పుడు కాపు సామాజిక వర్గం నాయకులు అంతా ఏకం అవుతున్నారు.కాపుల కు రాజ్యాధికారం దక్కాలి అనే ఆలోచనకు వచ్చారు.
దీని కోసం వివిధ పార్టీల్లో ఉన్న కాపు సామాజిక వర్గం కీలక నాయకులంతా ఏకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ మేరకు హైదరాబాదులో కాపు ప్రజాప్రతినిధులు కీలక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కాపులంతా ఏకమవ్వాలని, దీనికోసం కాపులంతా ప్రత్యేకంగా పార్టీ పెట్టాలని డిసైడ్ అయ్యారట.అయితే కాపుల కోసం ప్రత్యేకంగా పార్టీ పెడితే కేవలం కాపు సామాజిక వర్గం ఒకటే అండగా నిలబడుతుందని, మిగతా కులాలు పూర్తిగా దూరమవుతాయని, అప్పుడు పార్టీ అధికారంలోకి ఎలా వస్తుందనే ప్రశ్న కూడా ఈ సందర్భంగా తలెత్తినట్లు తెలుస్తోంది.
దీంతో కాపులంతా ఏకమైతే అప్పుడు వివిధ రాజకీయ పార్టీలు తమ దగ్గరికి వస్తాయని, తమ అండ కావాలని కోరుతాయి అని, కాపు నాయకులు ఈ సందర్భంగా అభిప్రాయ పడ్డారట.
హైదరాబాదులో నిర్వహించిన ఈ సమావేశానికి సీబీఐ మాజీ జేడీ వి.వి లక్ష్మీనారాయణ తో పాటు, వంగవీటి రాధాకృష్ణ వంటి వారితో పాటు, టీడీపీ , బీజేపీ , వైసీపీ లోని కీలక నాయకులు చాలామంది ఈ సమావేశానికి హాజరైనట్లు సమాచారం.ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం పై కాస్త వ్యతిరేకత పెరిగిందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండడం తో టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకునే ఆలోచనలు ఉండడం, కాపులకు అన్ని రాజకీయ పార్టీలు ప్రాధాన్యం ఇచ్చే విధంగా వ్యవహరించడం ఇలా ఎన్నో అంశాలతో ఇప్పుడు కాపు సామాజిక వర్గం కొత్త పార్టీ పెట్టడమా లేక ఐక్యంగా కలిసి ముందుకు వెళ్లి తమ ప్రాధాన్యాన్ని మరింత పెంచుకోవడమా అనే ఆలోచనలు ఉన్నాయనేది క్లారిటీ రావాల్సి ఉంది.
కాపు సామాజిక వర్గం కీలక నాయకులు నిర్వహించిన ఈ సమావేశం పై అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.

తమ పార్టీకి చెందిన నాయకులు ఈ సమావేశం లో పాల్గొనడం తో భవిష్యత్తులో ఏ విధంగా వీరు అడుగులు వేస్తారు అనేది కీలకం కాబోతోంది.ఉభయగోదావరి జిల్లాల్లో ప్రస్తుతం జనసేన పార్టీ కీలకంగా ఉంది.జనాసేన మద్దతు ఉంటే కాపు సామాజికవర్గం అండదండలు పుష్కలంగా అందుతాయి అని, గెలుపు తమకు దక్కుతుందని ఆలోచనలో టీడీపీ , బీజేపీ వంటి పార్టీలు ఉన్నాయి.
ఈ క్రమంలోనే మిగతా పార్టీల్లోని కాపు సామాజికవర్గం నేతలంతా ఇపుడు పార్టీలకతీతంగా ఏకమవుతూ ఉండడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.