బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు బిగ్ బాస్ నిర్వాహకులు బ్రేక్ ఇవ్వనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిగ్ బాస్ రియాలిటీ షో కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సల్లు భాయ్ ఈ షో కోసం భారీ గా రెమ్యునరేషన్ అందుకున్న విషయం తెలిసిందే.
అయితే ఇప్పటికే ప్రభు దేవా దర్శకత్వంలో దబాంగ్-3 సినిమా క్రిస్మస్ కు రిలీజ్ అవుతుండగా, మరో చిత్రం రాధే అనే సినిమా కూడా ఈద్ పండుగ నాడు రిలీజ్ కు ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే.అయితే ఈ నేపథ్యంలో తన వద్ద ఉన్న డేట్స్ అన్నిటిని కూడా ఈ రాధే చిత్రం కోసం కేటాయించడం తో ఇప్పుడు బిగ్ బాస్ షో కు సల్మాన్ హోస్ట్ గా వ్యవహరించగలుగుతాడా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రతి ఏడాది ఈద్ కు సల్మాన్ ఒక మూవీ ని రిలీజ్ చేయడం ఆనవాయితీ గా వస్తుంది.అందుకే సల్లు భాయ్ ఈ రాధే చిత్రం పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.
ఈ చిత్రం కు కూడా ప్రభుదేవా నే దర్శకత్వం వహిస్తుండడం విశేషం.అయితే ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాస్ 13 వ సీజన్ లో ఇప్పటివరకు కూడా సల్మాన్ హోస్ట్ గా వ్యవహరిస్తూ వచ్చాడు.
అయితే ఇప్పుడు ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా సల్మాన్ ప్లేస్ లో మరొకరిని తీసుకురావాలని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నట్లు సమాచారం.బిగ్‌బాస్ 13 వ సీజన లో సల్మాన్ ప్లేస్‌ను ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరాఖాన్‌తో రీప్లేస్ చేయాలనే ఆలోచనలో నిర్వాహకులు ఉన్నట్లు సమాచారం.
ఇప్పటికే ఫరాఖాన్.బిగ్‌బాస్ 8 కు హోస్ట్ గా వ్యవహరించిన అనుభవం కూడా ఉండడం తో తిరిగి ఆమెనే అయితే ఈ షో కు న్యాయం చేస్తారు అని నిర్వాహకులు భావిస్తున్నారు.
ఒకవేళ ఆమె గనుక ఈ షో చేయడానికి ఒప్పుకోకపోతే షో లలో అనుభవం ఉన్న కరణ్ జోహార్ ని తీసుకురావాలని, అదీ కుదరదు అనుకుంటే మరో స్టార్ నటుడు అనిల్ కపూర్ ని ఆ ప్లేస్ లో దించాలని చూస్తున్నారు నిర్వాహకులు.మరి ఇప్పుడు బిగ్ బాస్ 13 వ సీజన్ లో సల్మాన్ తరువాత ఎవరు హోస్ట్ గా వ్యవహరిస్తారో అన్న విషయం తెలియాలి అంటే కొద్దీ రోజులు ఆగాల్సిందే.