సినిమా ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas )…ఈయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంటాయి.ఇక ఇలాంటి క్రమంలో ప్రస్తుతం ఈయన ఏ సినిమా చేస్తున్నాడు అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
ఇక గుంటూరు కారం సినిమా రిలీజ్ కి ముందు వరకు అల్లు అర్జున్(Allu Arjun ) తో త్రివిక్రమ్ సినిమా చేస్తాడు అనే ఒక టాక్ అయితే ఉండేది.అయితే గుంటూరు కారం ( Guntur Kaaram )సినిమా ప్లాప్ అవ్వడం తో ప్రస్తుతం ఈయన అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడా లేదా అనే విషయాలు మాత్రం ఎవరికీ తెలియలేదు.

ఒకవేళ ఈ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చినా కూడా సినిమా స్టార్ట్ అవుతుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.ఇక ఇప్పటికే అల్లు అర్జున్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో ఒక చేయాల్సి ఉంది.ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం త్రివిక్రమ్ లేడీ ఓరియెంటెడ్( Trivikram Srinivas సినిమా కూడా చేస్తున్నాడు అంటూ వార్తలైతే వస్తున్నాయి.

ఇందులో ఏది నిజం అనే విషయాలు తెలియాలంటే త్రివిక్రమ్ ఈ విషయాలు మీద స్పందిస్తే తప్ప పూర్తి అవగాహన అయితే రాదు.ఇక ఇది ఇలా ఉంటే త్రివిక్రమ్ లాంటి ఒక స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం ఖాళీగా ఉండటం అనేది అతని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.దానికి కారణం ఏంటి అంటే ఎప్పుడు ఏదో ఒక సినిమాతో ఇండస్ట్రీ ఉన్న స్టార్ హీరోలు అందరితో సినిమాలు చేస్తూ వస్తున్నాడు.
కాబట్టి తను ఖాళీగా ఉండటం అనేది ప్రేక్షకులు ఎవరు చూడలేకపోతున్నారు.ఇక మొత్తానికైతే కొద్దిరోజుల్లోనే ఏదో ఒక సినిమాతో త్రివిక్రమ్ కంబ్యాక్ కి ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది…
.







