నిపుణులైన వృత్తి పనివారిని అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పనిచేసుకోవడానికి అనుమతించే హెచ్ 1 బీ వీసా( H1B Visa )కు సంబంధించి అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (యూఎస్‌సీఐఎస్) మంగళవారం ఒక కీలక ప్రకటన జారీ చేసింది.ఎఫ్‌వై 25కు గాను హెచ్ 1 వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 22తో ముగుస్తుందని పేర్కొంది.
ఈ సమయంలో ఎంపిక ప్రక్రియ కోసం ప్రతి లబ్ధిదారుణ్ణి ఎలక్ట్రానిక్ పద్ధతిలో నమోదు చేయడానికి , ప్రతి లబ్ధిదారునికి అనుబంధిత రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించడానికి పిటిషనర్లు, చట్టపరమైన ప్రతినిధులు తప్పనిసరిగా యూఎస్‌సీఐఎస్ ఆన్‌లైన్ ఖాతా( USCIS )ను ఉపయోగించాలని అధికారులు తెలిపారు.ఆన్‌లైన్ ఖాతా వినియోగదారులు తమ ఆన్‌లైన్ ఖాతాలలో మెరుగైన సంస్థాగత ఖాతా లక్షణాలతో రిజిస్ట్రేషన్ , పిటిషన్‌పై సహకరించుకోగలుగుతారు.

ఫాం ఐ 129 (వలసేతర వర్కర్ కోసం పిటిషన్), ఫాం ఐ 907 (ప్రీమియం ప్రాసెసింగ్ సేవ కోసం అభ్యర్ధన)లను ఆన్‌లైన్ ఖాతాలో అందుబాటులో వుంచినట్లు యూఎస్‌సీఐఎస్ పేర్కొంది.అలాగే ఏప్రిల్ 1 నుంచి హెచ్ 1 బీ క్యాప్ పిటిషన్ ఫాంల ఆన్‌లైన్ ఫైలింగ్‌ను స్వీకరిస్తామని యూఎస్‌సీఐఎస్ పేర్కొంది.నాన్ క్యాప్ హెచ్ 1 బీ పిటిషన్‌ల( Non Cap H1B Petition ) ఆన్‌లైన్ ఫైలింగ్ వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని ఏజెన్సీ స్పష్టం చేసింది.కాగా, ఏటా హెచ్-1 బీ వీసాల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తుంటాయి.
వీటిలో కంప్యూటర్ ఆధారిత లాటరీ పద్ధతి ద్వారా 65వేల దరఖాస్తులను ఎంపిక చేసి అమెరికా వీసా జారీ చేస్తుంది.వీటితో పాటు సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) విభాగాల్లో అమెరికా యూనివర్శిటీల్లో ఉన్నత విద్య పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు మరో 20వేల వీసాలు ఇస్తారు.
అంటే మొత్తం 85 వేల హెచ్ 1 బీ వీసాలన్న మాట.

ఇదిలావుండగా.హెచ్ 1 బీ వీసా ప్రక్రియ, గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్( Green Card Backlog ) సహా దేశంలోని చట్టబద్ధమైన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాను చేయగలిగినదంతా చేస్తున్నారని ఇటీవల వైట్‌హౌస్ పేర్కొంది.ఈ మేరకు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియరీ( White House press secretary Karine Jean-Pierre ) విలేకరులకు తెలిపారు .చట్టబద్ధమైన వలసదారుల కష్టాలను పరిష్కరించడంలో అధ్యక్షుడు చేస్తున్నంత ప్రయత్నం .అక్రమ వలసదారుల కోసం చేయడం లేదని భారతీయ అమెరికన్లలోని ఒక వర్గంలో వున్న భావన గురించిన ప్రశ్నలకు సైతం ఆమె సమాధానమిచ్చారు
.






