యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన కెరీర్లోని 20వ చిత్రాన్ని శరవేగంగా తెరకెక్కించే పనిలో పడ్డాడు.జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా పీరియాడికల్ ప్రేమకథగా వస్తుందని చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది.
అయితే గతకొంత కాలంగా ప్రభాస్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరోను ఓ కోరిక కోరుతున్నారు.
ప్రభాస్ ఇటీవల పాన్ ఇండియా మూవీలతో వస్తూ సక్సెస్ను అందుకుంటున్నాడు.
అయితే ఊరమాస్ చిత్రాలకు ప్రభాస్ పూర్తిగా దూరమవుతున్నాడనేది నిజం.గతంలో కొన్ని సినిమాల్లో ప్రభాస్ ఎలాంటి మాస్ అవతారంలో కనిపించాడో అందరికీ తెలిసిందే.
ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి.కానీ బాహుబలి సినిమా నుండి ప్రభాస్ తన రూటు పూర్తిగా మార్చాడు.
భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలకే ప్రభాస్ పెద్ద పీట వేస్తున్నాడని, ఆయన సినిమాల్లో మాస్ అంశాలు పూర్తిగా కనుమరుగవుతున్నాయని ఫ్యాన్స్ అంటున్నారు.
ఇప్పటికైనా ప్రభాస్ ఓ పూర్తిస్థాయి మాస్ ఎంటర్టైనర్ మూవీని తెరకెక్కించాలని వారు కోరుతున్నారు.
మరి ఫ్యాన్స్ కోరికను ప్రభాస్ తీరుస్తాడా లేడా అనేది చూడాలి.