ILT20 23: అదేంటది! తిరిగి విసురుతాడు అనుకుంటే పట్టుకొని పారిపోయాడు!

Fan Picks And Run Away With Ball After It Lands Outside Of The Stadium In Ilt20 23

అబుదాబి వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ T20 క్రికెట్లో మునుపెన్నడూ చూడని దృశ్యం ఆవిష్కృతం అయింది.ఓ రకంగా చెప్పుకోవాలంటే అదొక హాస్యాస్పద సన్నివేశం అనొచ్చు.

 Fan Picks And Run Away With Ball After It Lands Outside Of The Stadium In Ilt20-TeluguStop.com

అవును, బ్యాటర్ బంతిని బలంగా కొట్టడంతో అది స్టేడియం అవతల పడింది.స్టేడియం బయట ఉన్న వ్యక్తి దానిని పట్టుకొని కొన్ని సెకెన్లు పాటు బంతిని తేరిపారా చూసి మరి ఏమనిపించిందో గాని, బంతిని తీసుకొని అక్కడినుంచి పారిపోయాడు.

బంతిని తిరిగి ఇస్తాడనుకొని ఎదురు చూసిన ప్లేయర్స్ కి నిరాశే ఎదురయ్యింది.

Telugu Dubai, Fan, Ilt, Itl, Kieron Pollard, Latest, Sharjah Stadium, Ups-Latest

అవును, MAI ఎమిరేట్స్, డెసర్ట్ వైపర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఈ సంఘటన చోటు చేసుకోగా దానికి సంబంధించినటువంటి వీడియో ఇపుడు వైరల్ అవుతోంది.ఎమిరేట్స్ బ్యాటింగ్ సమయంలో మౌస్లే డీప్ స్క్వేర్ లెగ్ దిశగా బంతిని స్టాండ్స్ అవతలకి కొట్టాడు.దాంతో బంతి నేరుగా వెళ్లి బ్రిడ్జి పైన పడింది.

అక్కడికి క్రీడాకారులు చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది.అక్కడున్న వ్యక్తులు ఎవరో ఒకరు దానిని విసరకపోతారా అని వారు ఎదురు చూసారు.

కానీ వారి ఆశ నిరాశే అయింది.దాంతో వారు చేసేదేమి లేక వేరొక బంతితో ఆటని కొనసాగించారు.

Telugu Dubai, Fan, Ilt, Itl, Kieron Pollard, Latest, Sharjah Stadium, Ups-Latest

సదరు బంతిని ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి తీసుకొని బంతితో అక్కడి నుంచి ఉడాయించాడు.ప్రస్తుతం ఈ సరదా దొంగతనం తాలూకా ఫుటేజ్ ట్విట్టర్ లో అందుబాటులో వుంది.ఇక ఆ తర్వాత కూడా కీరన్ పొలార్డ్ భారీ సిక్సర్ కొత్తగా ఈసారి కూడా బంతి స్టేడియం అవతల పడింది.అయితే ఇపుడు అలాంటి అపరిచితుడికి మనవాళ్ళు అవకాశం ఇవ్వలేదు.

మనవాళ్లే వెళ్లి తీసుకున్నారు.దీనికి సంబంధించిన వీడియోను ఐఎల్టి 20 తన ట్విటర్లో షేర్ చేస్తూ….

సిక్సర్ల వర్షం కురుస్తోంది, మీరు ఏ టైప్ క్రికెట్ లవర్స్? బంతిని తీసుకొని పారిపోతారా? లేదంటే బంతిని తిరిగి ఇచ్చేస్తారా? మీరే ఎంపిక చేసుకొండి! అంటూ కామెంట్ చేసింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube