మిస్టర్ బీస్ట్( Mr Beast ) ప్రపంచంలోని మోస్ట్ పాపులర్ యూట్యూబర్లలో ఒకరు.ఈ అమెరికన్ యూట్యూబర్ మెయిన్ ఛానెల్కు 239 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు.
ఈ సక్సెస్ఫుల్ సోషల్ మీడియా స్టార్( Social Media Star ) కు కేవలం 25 ఏళ్లే.అయినా డబ్బులను అసలు లెక్కచేయడు.
కొంచెం కూడా దాచుకోవడానికి ఇష్టపడడు.ఖరీదైన వీడియోలు చేస్తుంటాడు.
అందువల్లే అతను బాగా పాపులర్ అయ్యాడు.యూట్యూబ్( YouTube ) ద్వారా సంపాదించిన డబ్బుతో మనుషులకు, జంతువులకు ఎన్నో మంచి పనులు చేశాడు.
ఉదాహరణకు, అతను 1,000 కంటి శస్త్రచికిత్సలు, 100 నీటి బావులు, 2000 కృత్రిమ అవయవాలు, అనేక కుక్కల దత్తత కోసం డబ్బులు చెల్లించాడు.అతను వివిధ కారణాల కోసం చాలా డబ్బును కూడా విరాళంగా ఇచ్చాడు.
ఈ మంచి పనులు చేయడం వల్ల ప్రజలు అతడిని మరింత ఇష్టపడ్డారు.

ఫోర్బ్స్ ప్రకారం, 2021లో అతను యూట్యూబ్ నుంచి 54 మిలియన్ డాలర్లు సంపాదించాడు.ఒక సంవత్సరంలో యూట్యూబర్కి ఇది చాలా పెద్ద సంపాదన అని చెప్పుకోవచ్చు.ఇప్పుడు, 2024లో అతను యూట్యూబ్ నుంచి సంవత్సరానికి 600-700 మిలియన్ డాలర్లు( YouTube Income ) సంపాదిస్తున్నాడు.
అంటే సంవత్సరానికి 6 వేల కోట్లు.కానీ అతను ధనవంతుడనని ఎప్పుడూ అనుకోడు.
టైమ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను తన డబ్బులో ఎక్కువ భాగాన్ని తన వీడియోలు రూపొందించడానికి తిరిగి ఖర్చు చేస్తానని చెప్పాడు.తాను ఏ డబ్బు దాచి పెట్టకుండా పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతానని చెప్పాడు.

ఈ వయసులో ఎంత పెట్టుబడి( Investment ) పెడితే అంత ఎక్కువ డబ్బులు తిరిగి వస్తాయని తాను నమ్ముతున్నట్లు చెప్పాడు.డబ్బులు అన్ని సేవ్ చేసుకోకుండా చివరికి దివాలా తీసే అమాయకుడిని కాను అని కూడా చెప్పాడు.2022, సెప్టెంబర్లో అతను తనకు లభించిన స్పాన్సర్షిప్ డబ్బు అయిన 10,000 డాలర్లను మొత్తం విరాళంగా ఇచ్చేస్తాడు.అతడి మొదటి పెద్ద విరాళమట.
ఆ తర్వాత అతడు విరాళాలు ఇస్తూనే ఉన్నాడు.బాగా పెట్టుబడులు పెడుతూ పెట్టుబడులకు మించిన సంపాదన రాబడుతున్నాడు.







