వీడియో: సీమంతం వేడుకలు ఏర్పాటు చేసి టీచర్ను సర్ప్రైజ్ చేసిన స్టూడెంట్స్..

గర్భవతుల ఆరోగ్యం, సౌభాగ్యం కోసం జరిపే శుభకార్యం సీమంతం( Seemantham ).ఈ రోజుల్లో ప్రతి తల్లి ఈ వేడుక జరుపుకుంటుంది.తద్వారా ఆమె గర్భధారణ సమయంలో చక్కని అనుభూతులను పొందుతుంది.ఈ వేడుకలో తల్లి, అత్తయ్య ముఖ్య పాత్ర పోషిస్తారు.పారాణి, గాజులు, చీర సమర్పిస్తారు.ఈ వేడుక గర్భవతి జీవితంలో ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది.

 College Students Surprise Professor With A Baby Shower,baby Shower,professor,col-TeluguStop.com

సాధారణంగా దీనిని కుటుంబ సభ్యులు చేస్తారు కానీ ఒక స్కూల్ స్టూడెంట్స్ తమ టీచర్ కోసం ఈ వేడుకను నిర్వహించి ఆమెను సడన్ సర్ప్రైజ్ చేశారు.కేరళ( Kerala )లోని ఒక స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థులు తల్లి సమానురాలైన తమ టీచర్కు బేబీ షవర్ ఫంక్షన్( Baby Shower Function ) ను క్లాస్ రూమ్లో ఘనంగా జరిపారు.

ఆ విద్యార్థుల బృందం బేబీ షవర్తో తమ టీచర్ను ఆశ్చర్యపరిచిన క్షణాలను ఇతరులు వీడియో తీశారు.ఆ వీడియోను ఇన్స్టాగ్రామ్( Instagram )లో పోస్ట్ చేశారు.ఆ క్లిప్ బ్యూటిఫుల్ గా ఉండటంతో నెటిజన్లు ఫిదా అయ్యారు.చాలా మంది ఈ వీడియోను లైక్ చేసారు, విద్యార్థుల ఆప్యాయతను ప్రశంసించారు.బెలూన్లు, కేకులతో తరగతి గదిని విద్యార్థులు ఎలా సిద్ధం చేశారో వీడియోలో చూపించారు.టీచర్ పార్టీని చూసినప్పుడు చాలా ఆశ్చర్యం, సంతోషం వ్యక్తం చేసింది.

తన పట్ల ఎంతో ప్రేమను, ఆదరణను( Love and Affection ) కనబరిచిన తన విద్యార్థులను పట్టుకుని ఆమె ఆనందభాష్పాలు కార్చింది.ఈ వీడియో ఫిబ్రవరి 6న పోస్ట్ అయింది, దీనికి 42 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.“టీచర్ ఈ క్లాస్ను ఎప్పటికీ మరచిపోదు.ఆమె ఆనందం వెలకట్టలేనిది.

నేను ఈ వీడియోని చాలా సార్లు చూసా.ఈ వేడుకతో ఆమె కడుపులో ఉన్న బిడ్డ కూడా ఎంతో సంతోషించి ఉంటుంది.ఈ ఈవెంట్ను ప్లాన్ చేసింది ఎవరు? వారికి హగ్స్ ఇవ్వాలనుకుంటున్నా.” అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube