ప్రముఖ యూట్యూబర్ చందూ సాయి అరెస్ట్.. ఆ యువతిని నమ్మించి మోసం చేయడంతో?

యూట్యూబ్ ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న వాళ్లలో చందూసాయి ఒకరు.

చందూ సాయి( Youtuber Chandu Sai ) డైలాగ్ డెలివరీకి, టైమింగ్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.

అయితే ఈ ప్రముఖ యూట్యూబర్ ను పోలీసులు అరెస్ట్ చేయడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.ఒక యువతిని పెళ్లి చేసుకుంటానని చందూ సాయి నమ్మించి మోసం చేశారని సమాచారం అందుతోంది.

యువతి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు చందూ సాయిని( Chandu Sai ) అరెస్ట్ చేశారు.నార్సంగికి చెందిన యువతికి చందూసాయి ప్రేమ పేరుతో దగ్గరయ్యారని తెలుస్తోంది.

పెళ్లి మాట ఎత్తేసరికి చందూ సాయి మొహం చాటేయడంతో యువతి పోలీసులను ఆశ్రయించింది.మోసం, అత్యాచారం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

Advertisement

చందుతో పాటు అతడి తల్లీదండ్రులు, మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారని తెలుస్తోంది.

చందు అసలు పేరు చంద్రశేఖర్ సాయికిరణ్( Chandrasekhar Saikiran ) కాగా యూట్యూబ్ లో చందూగాడు అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా చందూ సాయి పాపులారిటీని పెంచుకున్నారు.చందూసాయి యూట్యూబ్ ఛానల్ కు ఐదున్నర లక్షల కంటే ఎక్కువగా సబ్ స్క్రైబర్స్ ఉన్నారు.చందూసాయి సన్నిహితులు ఈ వివాదం గురించి ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

నెలకు లక్ష రూపాయల రేంజ్ లో సంపాదిస్తున్నానని చందూసాయి గతంలో ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు.చందూ సాయి ఈ కేసు నుంచి త్వరగా బయటపడాలని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు.చందూసాయి గురించి ఎవరో కావాలనే తప్పుగా ప్రచారం చేస్తున్నారని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.

చందూ సాయి పలు సినిమాలలో సైతం నటించగా ఆ సినిమాలలో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయి.సరిలేరు నీకెవ్వరు( Sarileru Neekevvaru ) సినిమాలో చిన్న పాత్రలో చందూ సాయి మెరిశారు.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

చందూసాయి రేంజ్ అంతకంతకూ పెరుగుతున్న సమయంలో ఆయన అరెస్ట్ కావడం అందరికీ షాకిస్తోంది.

Advertisement

తాజా వార్తలు