హీరోయిన్ భానుప్రియ డైరెక్టర్ వంశీ మధ్య ప్రేమకథ ఇదే.. కెమెరామేన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ప్రముఖ కెమెరామేన్లలో ఒకరైన ఎంవీ రఘు ఒక ఇంటర్య్వూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.ఎంవీ రఘు మాట్లాడుతూ తాను వంశీ, కె.

విశ్వనాథ్ తో పని చేశానని వెల్లడించారు.కె.

వాసు గారు తనకు బ్రేక్ ఇచ్చారని ఆయన చెప్పుకొచ్చారు.విజయబాపినీడు డైరెక్షన్ లో తెరకెక్కిన మగమహారాజు సినిమాతో తాను ఇండస్ట్రీకి పరిచయమయ్యాయని ఆయన వెల్లడించారు.

విజయబాపినీడు నన్ను ఎంతగానో ప్రోత్సహించారని ఆయన తెలిపారు.చిరంజీవి గారి సినిమాలకు లోక్ సింగ్ ఎక్కువగా కెమెరమేన్ గా ఉండేవారని రఘు అన్నారు.

Advertisement

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా తెరకెక్కితే లోక్ సింగ్ కెమెరామేన్ గా ఉండేవారని ఆయన చెప్పుకొచ్చారు.నేను తన సినిమాలకు లేనప్పుడు వంశీ చాలాసార్లు నా పేర్లు తలచుకునేవారని రఘు తెలిపారు.

ఎప్పుడైనా తనకు వస్తాయని అనుకున్న సినిమాలు మిస్ అయితే మాత్రం ఒక చిన్న ఫీలింగ్ అయితే ఉంటుందని రఘు చెప్పుకొచ్చారు.

నీకు రాసిపెట్టి లేకపోతే ఆ సినిమా ఎన్ని అడ్డంకులు వచ్చినా నీకు వచ్చి తీరుతుందని అల్లు అరవింద్ తనతో అన్నారని రఘు తెలిపారు.వంశీకి తనకు మధ్య వాదన జరుగుతుందని జరిగే ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని రఘు వెల్లడించారు.మేకప్ విషయంలో కొన్నిసార్లు చర్చ జరిగేదని రఘు చెప్పుకొచ్చారు.

మేకప్ ఎక్కువ బ్రైట్ గా వస్తే చర్చ జరిగేదని రఘు వెల్లడించారు.

కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?
కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?

ఆ సినిమాలో భానుప్రియ హీరోయిన్ అని భానుప్రియ మేకప్ తగ్గించాలని చెప్పినందుకు వంశీ అందరి ముందు చెప్పానని ఫీలయ్యాడని భానుప్రియ హర్ట్ అయిందని తనతో చెప్పాడని రఘు పేర్కొన్నారు.ఆ సమయంలో తప్పు తనది కాదని తాను సినిమా మానేస్తానేమో కానీ సారీ మాత్రం చెప్పనని రఘు చెప్పుకొచ్చారు.వంశీ భానుప్రియ గురించి వచ్చిన గాసిప్స్ గురించి రఘు చెబుతూ అతను ఇష్టపడటం మొదలుపెట్టాడని కెరీర్ ఇచ్చాడు కాబట్టి ఆమె కోపరేట్ చేసిందని అయితే వాటిలో కొన్ని నిజాలు కొన్ని గాసిప్స్ ఉన్నాయని రఘు అన్నారు.

Advertisement

తాజా వార్తలు