భారత్‌కు మరో తలనొప్పి.. మా బిడ్డ మరణంపై విచారణ జరపండి : అవతార్ ఖండా ఫ్యామిలీ డిమాండ్

ఖలిస్తాన్ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్య వెనుక భారత ప్రభుత్వ హస్తం వుండొచ్చంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.

దీంతో ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన ఇబ్బందులు తలెత్తాయి.

ఈ క్రమంలో భారత ప్రభుత్వానికి మరో తలనొప్పి ఎదురైంది.ఈ ఏడాది లండన్‌లోని భారత హైకమీషన్ కార్యాలయం వద్ద హింసకు సూత్రధారి అవతార్ సింగ్ ఖండా( Avtar Singh Khanda ) మృతిపై అతని కుటుంబం అధికారిక విచారణకు డిమాండ్ చేసింది.

ఈ మేరకు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ చీఫ్ కరోనర్‌కు విజ్ఞప్తి చేసింది.సోమవారం లండన్‌లోని భారత హైకమీషన్ వెలుపల ఖలిస్తాన్ మద్ధతుదారులు భారత వ్యతిరేక నిరసనను చేపట్టిన సమయంలో ఖండా ఫ్యామిలీతో పాటు యూకే సిక్కు ఫెడరేషన్ నుంచి ఈ డిమాండ్ వచ్చింది.

ఈ ఘటన యూకే- భారత్ మధ్య దౌత్యపరమైన ఘర్షణకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.నిజ్జర్, ఖండా ఇద్దరూ భారత ప్రభుత్వం ఉగ్రవాద సంస్థలుగా నిషేధించిన ఖలిస్తాన్ ఆర్గనైజేషన్‌లతో( Khalistan ) సంబంధాలు కలిగి వున్నారు.ది గార్డియన్ ప్రకారం.

Advertisement

విచారణను కోరిన బారిస్టర్ మైఖేల్ పోలాక్.( Barrister Michael Polak ) ఖండా ప్రమాదానికి గురయ్యే అవకాశం వుందన్న సంగతిని బ్రిటీష్ పోలీసులు అర్ధం చేసుకోవాలని కోరారు.

ఖండా మరణం వెనుక భారత్ హస్తం వుందని తాను ఖచ్చితంగా చెప్పలేనని, అయితే పరిస్ధితులను బట్టి సమగ్ర దర్యాప్తు చేయాల్సి వుందని పోలాక్ అభిప్రాయపడ్డారు.ఖండాకు వచ్చిన బెదిరింపులు, అతనిని శత్రువు నెంబర్ 1 (మీడియాలో) పేరు పెట్టారని ఇవన్నీ అనుమానాస్పదంగా వుందన్నారు.

కాగా.అనారోగ్యంతో బర్మింగ్‌హామ్‌లోని ఆసుపత్రిలో చేరిన ఖండా ఈ ఏడాది జూన్ 15న ప్రాణాలు కోల్పోయాడు.తీవ్రమైన మైలోయిడ్ లుకేమియా (బ్లడ్ క్యాన్సర్) ( Blood Cancer ) కారణంగా ఖండా మరణించినట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్ తెలిపింది.

అయితే తమ బిడ్డకు లుకేమియా వున్నట్లుగా నిర్ధారించే వైద్య పరమైన రికార్డులు తమకు అందలేదని ఖండా కుటుంబ సభ్యులు చెబుతున్నారు.హోమ్ ఆఫీస్ వీసా నిరాకరించడంతో ఖండా తల్లి అంత్యక్రియలకు హాజరుకాలేకపోయింది.

నైజాంలో కంగువకు భారీ షాక్.. పుష్ప ది రూల్ కు సైతం ఇబ్బందులు తప్పవా?
అమ్మాయి కనపడితే ముద్దయినా పెట్టాలి ?కడుపైనా చేయాలన్న బాలయ్య జైల్లో పెట్టారా : పోసాని

అయితే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సిక్కు సమాజం మాత్రం ఖండాపై విష ప్రయోగం జరిగిందని ఆరోపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు