క్షుద్ర పూజలు మాటున బాలికపై దారుణం

ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళపై అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.చుట్టూ ఉన్నవారినే కాకుండా సొంత మనుషులని కూడా నమ్మలేని పరిస్థితి నెలకొని ఉంది.

వయసుతో సంబంధం లేకుండా ఆడపిల్ల అనిపిస్తే చాలు కోరిక తీర్చుకోవడానికి మృగాళ్ళు ఏ మాత్రం ఆలోచించడం లేదు.కనికరం లేకుండా అత్యాచారానికి పాల్పడుతున్నారు.

ఇప్పుడు ఇలాంటి ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు చేయాలని చెప్పి గుంటూరు జిల్లాకి చెందిన విష్ణువర్ధన్ అనే వ్యక్తి బాలికపై అతి కిరాతకంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.

దొనకొండ మండలంలోని రుద్రసముద్రానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తితో విష్ణువర్ధన్‌కు ఇటీవల పరిచయమైంది.ఈ క్రమంలో గ్రామంలోని కొందరికి తాయెత్తులు కట్టేందుకు రావాలంటూ విష్ణువర్ధన్‌ను రామాంజనేయులు ఆహ్వానించాడు.

Advertisement

గ్రామానికి వచ్చిన విష్ణువర్ధన్‌కు ఓ ఇంటిలో బస ఏర్పాటు చేశారు.బస చేసిన ఇంటి యజమాని కుమార్తెపై కన్నేసిన విష్ణువర్ధన్ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని నమ్మబలికాడు.

బాలికతో పూజలు చేయిస్తే వాటిని వెలికి తీయొచ్చని చెప్పాడు.నిజమేనని నమ్మిన ఇంటి యజమాని పూజలకు ఏర్పాటు చేశాడు.

గదిలోకి వెళ్లిన తర్వాత పూజల పేరుతో బాలికపై విష్ణువర్ధన్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.క్షుద్రపూజలు చేస్తున్నాడన్న అనుమానంతో గ్రామస్థులు అతడిని నిలదీయడంతో బాలికపై అత్యాచార విషయం వెలుగుచూసింది.

తల్లిదండ్రులని నమ్మించి బాలికపై అఘాయిత్యం చేసిన నిందితుడికి దేహశుద్ది చేసిన గ్రామస్తులు అతడిని పోలీసులుకు అప్పగించారు.మనుషులలో గుప్తనిధులపై ఆశలు, మూఢ భక్తి ఎక్కువైతే ఎలాంటి సంఘటలు జరుగుతాయో ఈ ఉదంతం మరోసారి రుజువు చేసింది.

ఏంటి భయ్యా ఇది నిజమేనా? సానియా మీర్జా, షమీ పెళ్లిచేసుకున్నారా?
Advertisement

తాజా వార్తలు