బంపరాఫర్.. ఫ్రీగా రేంజ్ రోవర్ కారు.. ఈ లింక్‌పై క్లిక్ చేస్తే!

ఫ్రీగా అత్యంత ఖరీదైన రేంజ్ రోవర్ కారు సొంతం చేసుకోవచ్చనే ఆఫర్ గురించి విన్నారా.తాజాగా వైరల్ అవుతున్న ఒక ఫేస్‌బుక్ పోస్ట్ ఇలాంటి బంపర్ ఆఫర్ ప్రకటించింది.

 Fake Links Offering Free Range Rover Car Spreading Across Facebook Details, Bump-TeluguStop.com

అయితే ఈ పోస్ట్ కింద కామెంట్స్ చేసి అందులోని లింక్‌పై కూడా క్లిక్ చేసి చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు.కానీ వారి అందరికీ తెలియని ఒక విషయం ఏంటంటే ఈ పోస్టు పూర్తిగా ఫేక్.

ఉచితంగా కార్ వస్తుందనే ఆశతో చాలా మంది అన్ని డీటెయిల్స్ కచ్చితంగా అందిస్తారనే ఉద్దేశ్యంతో కొందరు కేటుగాళ్లు ఈ స్కామ్‌కి తెరలేపారు.రిజిస్ట్రేషన్ సమయంలో వ్యక్తిగత వివరాలు బ్యాంక్ డీటెయిల్స్ సేకరించి వీరు మీ ఖాతా ఖాళీ చేయడంతోపాటు డేటా కూడా తస్కరిస్తారు.

ఈ లింక్ పై క్లిక్ చేస్తే కారు లభించడం అటుంచితే నిలువునా మోసపోవడం ఖాయం.

స్కామ్ పోస్ట్‌లో.“రేంజ్ రోవర్ 71వ వార్షికోత్సవం సందర్భంగా ఫ్రీగా 2022 రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కారు ఆఫర్ చేస్తున్నాం.త్వరగా కామెంట్ సెక్షన్‌లో హ్యాపీ బర్త్‌డే అని టైప్ చేయండి.

ఈ లింక్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోని కారు సొంతం చేసుకోండి.ఆఫర్ కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది” అని పేర్కొంటారు.

Telugu Bank, Bumper, Clik, Face, Links, Range Rover Car, Personal, Rangeover Car

ఫేస్‌బుక్‌లో హల్ చల్ చేస్తున్న ఈ పోస్టుకు స్పందించకపోవడమే మంచిది.ఒకవేళ ఈ లింక్ పై క్లిక్ చేస్తే వ్యక్తిగత వివరాలు అడగాలని ఒక వెబ్ సైట్ కోరుతుంది.వ్యక్తిగత వివరాలు అందిస్తే డేంజర్‌లో పడ్డట్టే.లింకు క్లిక్ చేసినా మీ ఫోన్ లోకి వైరస్ లేదా మాల్వేర్ ప్రవేశించే అవకాశం ఉంది.దీనివల్ల మీ ఫోన్ డేటా మొత్తం హ్యాకర్లు దొంగలించే ప్రమాదం ఉంది.అందుకే వీటి పట్ల జాగ్రత్త వహించాలని టెక్ నిపుణులు కూడా పేర్కొంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube