పల్నాడు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్స్ తయారీ ముఠా అరెస్ట్

పల్నాడు జిల్లాలో నరసరావుపేటలో నకిలీ సర్టిఫికెట్స్ తయారీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు.ఇంటర్ నెట్ సెంటర్ కేంద్రంగా నకిలీ సర్టిఫికెట్ల దందాను కొనసాగిస్తున్నట్లు గుర్తించారు.

ఈ దందాలో భాగంగా సర్టిఫికెట్ లో ఫొటోలు, సంతకాలు, తేదీలను ముఠా సభ్యులు మారుస్తున్నట్లు సమాచారం.శ్యామ్ ప్రసన్న, వెంకట రామారావు అనే ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.

ఇప్పటివరకు ఈ ముఠా ఏడుగురికి నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు.అనంతరం నిందితుల నుంచి కంప్యూటర్, ప్రింటర్స్ తో పాటు పేపర్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020
Advertisement

తాజా వార్తలు