తెలుగు సినీ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే.నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన దర్శకుడుగా, నిర్మాతగా కూడా చేశాడు.
తన నటనకు ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు.ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ విలన్, సహాయ పాత్రలలో నటిస్తున్నాడు.
గతం లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
ఈయన తొలిసారిగా ఇద్దరూ అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు.
ఆ తర్వాత హిట్లర్, చిరునవ్వుతో వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.కేవలం హీరోగానే కాకుండా విలన్ గా కూడా నటించాడు.
అంతేకాకుండా హీరో హీరోయిన్స్ కి తండ్రి పాత్రలో, తాత పాత్రలలో కూడా నటించాడు.తమిళంలో కూడా పలు సినిమాలలో నటించి దాదాపు 60కి పైగా సినిమాలలో నటించాడు.
ఇక ప్రస్తుతం పలు సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు.సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గానే కనిపిస్తాడు.తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో బాగా పంచుకుంటాడు.ఇక ఈయన రాజకీయపరంగా యాక్టివ్ గా ఉన్న సంగతి తెలిసిందే.
ఇక ఈయన వ్యక్తిగత జీవితానికి వస్తే.మరో నటుడు శ్రీహరి, ఈయన తోడల్లుళ్లు.
ప్రకాష్ రాజ్ మొదటి భార్య లలిత కుమారి. శ్రీహరి భార్య డిస్కో శాంతికి స్వయానా చెల్లెలు.

ఇక లలిత కుమారి తమిళంలో పలు సినిమాలలో నటించింది.సమయంలో తనకు ప్రకాష్ రాజ్ తో పరిచయం ఏర్పడటంతో 1994లో పెళ్లి చేసుకున్నారు.ఇక వీరికి ఇద్దరు కూతుర్లు.ఒక కుమారుడు.కానీ కుమారుడు నాలుగేళ్ల వయసులో మరణించాడు.ఆ తర్వాత ఈ దంపతుల మధ్య విభేదాలు రావడంతో విడాకుల వరకు దారితీసాయి.
అలా 2009లో వీరు విడాకులు తీసుకోగా.ప్రకాష్ రాజ్ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ పోనీ వర్మ ప్రేమలో పడి తనను 2010లో పెళ్లి చేసుకున్నాడు.ఇక పోనీ వర్మ లలిత కుమారి ఇద్దరు కూతుర్లను బాగా చూసుకుంటుంది అని తెలిసింది.ఇక వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు.
ఇక ప్రకాష్ రాజ్ తన మొదటి భార్యకు ప్రతి నెల 5 లక్షలు ఖర్చులకు ఇస్తున్నాడట.అతని ఇద్దరు కూతుర్లను చూసుకుంటున్నందుకు భరణం కింద ఇస్తున్నాడని తెలిసింది ప్రకాష్ రాజ్.

అయితే తన రెండో పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటో అనేది తానే ఓసారి తెలిపాడు.ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ కు యాంకర్ ఎందుకు మొదటి భార్యకు విడాకులు ఇచ్చారని అడిగాడు.దాంతో ప్రకాష్ రాజ్.తనకు తన భార్యకు మధ్య కొన్ని విషయాలలో పడలేదని తెలిపాడు.చివరికి కోర్టుకు కూడా వెళ్ళామని అన్నాడు.ఆ తర్వాత విడిపోయామని తెలిపాడు.
ఇక విడిపోయిన తర్వాత తనకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అనిపించిందట.ఇక తన రెండో భార్యను చూడటానికి వెళ్ళినప్పుడు తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని కూడా నిజం చెప్పాడట.
పెళ్లికి కూడా ఇద్దరు కూతుర్లు వస్తారని అన్ని వాళ్లే దగ్గరుండి చేస్తారని కూడా అన్నాడట.దాంతో వాళ్లు కూడా ఒప్పుకున్నారని తెలిపాడు ప్రకాష్ రాజ్.
.






