రిషబ్ శెట్టి సప్తమి గౌడ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ”కాంతారా” ఈ సినిమా సెన్సేషనల్ హిట్ సాధించిన విషయం తెలిసిందే.కన్నడంలో రిలీజ్ అయ్యి రికార్డ్ స్థాయి వసూళ్లు సాధిస్తూ బాక్సాఫీస్ దగ్గర అసాధారణమైన విజయాన్ని నమోదు చేసుకున్న ఈ సినిమా ఆ తర్వాత మిగతా భాషల్లో కూడా రిలీజ్ అయ్యింది.
ఎక్కడ రిలీజ్ అయినా ఈ సినిమాకు సేమ్ రెస్పాన్స్ రావడంతో దేశ వ్యాప్తంగా ఈ సినిమా గురించి చర్చించు కుంటున్నారు.కేవలం 16 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా దీనికి పదింతలు లాభాలను తెచ్చిపెట్టింది.
ఇంకా ఏమాత్రం ఈ సినిమా స్పీడ్ మాత్రం తగ్గడం లేదు.రెండు వారాలు అవుతున్న ఇంకా కలెక్షన్స్ బాగా వసూలు చేస్తూ ముందుకు పోతుంది.
ఇప్పటికే ఈ సినిమా చాలా రికార్డులను కొల్లగొట్టింది.ఇక కన్నడ పరిశ్రమలో అయితే అన్ని సినిమాల కంటే అత్యధికంగా వీక్షించిన సినిమాగా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది.
ఇదిలా కొనసాగుతూ ఉండగానే ఓటిటిలో ఎప్పుడు వస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.అయితే ఇప్పటి వరకు ఈ సినిమా అప్డేట్ అయితే రాలేదు.

ఇదిలా ఉండగా ఈ సినిమాకు అమెజాన్ ప్రైమ్ అదిరిపోయే ఆఫర్ ప్రకటించినట్టు టాక్ వస్తుంది.ఈ సినిమాను ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసింది.అయితే ఇప్పుడు ఇస్తున్న డీల్ ఏంటి అంటే.ఈ సినిమాను డీల్ చేసుకున్న దాని కంటే ముందుగానే రిలీజ్ చేస్తే మరింత ఎక్కువ ఇస్తామని ఆఫర్ ఇచ్చారట.
అమెజాన్ ప్రైమ్ కొన్ని రోజుల పాటు పే పర్ వ్యూ పద్ధతిలో విడుదల చేయనుందట.మరి ఈ ఆఫర్ ను కాంతారా టీమ్ ఒప్పుకుంటుందో లేదో చూడాలి.







