సర్జరీలు చేయించుకోవడం వల్ల అపాయం కలిగిన ప్రముఖ సెలబ్రిటీలు వీళ్లే!

సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లు వరుస విజయాలను సాధించడంతో పాటు సినిమాలలో అందంగా కనిపించడానికి ప్రాధాన్యత ఇస్తారు.ఏదైనా విషయంలో విమర్శ ఎక్కువైతే సర్జరీల ద్వారా ఆ సమస్యను అధిగమించడానికి ప్రాధాన్యత ఇస్తారు.

 Failures Fat Removal Surgery Film Industry Details Here , Michael Jackson, Sridevi, Rakhi Sawant, Juhi Chawla , Katrina Kaif, Vani Kapoor, Meenakshi Seshadri-TeluguStop.com

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో మొదట సర్జరీ చేయించుకున్న స్టార్ హీరోయిన్ శ్రీదేవి కావడం గమనార్హం.ఈ స్టార్ హీరోయిన్ కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్నారనే సంగతి తెలిసిందే.

శ్రీదేవి తన ముక్కుకు సంబంధించి సర్జరీ చేయించుకుంది.సర్జరీ తర్వాత శ్రీదేవి మరింత అందంగా కనిపించడంతో తర్వాత రోజుల్లో సర్జరీలు చేయించుకునే వాళ్ల సంఖ్య మరింత పెరిగింది.

 Failures Fat Removal Surgery Film Industry Details Here , Michael Jackson, Sridevi, Rakhi Sawant, Juhi Chawla , Katrina Kaif, Vani Kapoor, Meenakshi Seshadri-సర్జరీలు చేయించుకోవడం వల్ల అపాయం కలిగిన ప్రముఖ సెలబ్రిటీలు వీళ్లే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరో నటి మీనాక్షి శేషాద్రి సైతం ముక్కుకు సర్జరీ చేయించుకోవడం ద్వారా కెరీర్ విషయంలో లబ్ధి పొందారు.మరో నటి హేమా మాలిని వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా బ్లెఫరోప్లాస్టీ చేయించుకున్నారని ప్రచారం జరిగింది.

అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రామ్ లో పాల్గొనడానికి ముందు తల వెంట్రుకలు, దవడలు కరెక్ట్ అయ్యే విధంగా చికిత్స చేయించుకున్నారు.రజనీకాంత్ తన పెదాలపై ఉన్న మచ్చలను కాస్మెటిక్ సర్జరీ ద్వారా తొలగించుకున్నారు.

అయితే ఈ సర్జరీల వల్ల మైకేల్ జాక్సన్, శ్రీదేవి, రాఖీ సావంత్, జుహీ చావ్లా కత్రినా కైఫ్, వాణీ కపూర్ నష్టపోయారు.వీళ్లలో కొందరు సర్జరీల వల్లే ప్రాణాలను కోల్పోయారు.

పంజాబీ నటుడు వివేక్ షౌక్ లైపోసక్షన్ చేయించుకోవడం వల్ల ప్రాణాలు కోల్పోయారు.ఇలాంటి సర్జరీ వల్లే ఆర్తి అగర్వాల్ ప్రాణాలను కోల్పోయారు.కన్నడ నటి చేతనా రాజ్ ప్రాణాలు కోల్పోవడానికి సైతం ఇలాంటి సర్జరీ కారణం కావడం గమనార్హం.అందం కోసం సర్జరీలు చేయించుకోవడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని నిపుణులు చెబుతున్నారు.

కృత్తిమంగా వచ్చే అందం వల్ల తాత్కాలికంగా లాభం కలిగినా దీర్ఘకాలంలో నష్టాలు కలిగే అవకాశాలు ఉంటాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube