కొంతమంది సినిమా ఇండస్ట్రీకి రావాలని కలలు కంటారు.అయితే ఆ కలలో నెరవేరాలంటే చాలా సమయం పట్టొచ్చు.
ఒక్కోసారి ఏళ్లకు ఏళ్ల సమయం తీసుకున్న కూడా సరైన అవకాశం రాకపోవచ్చు.ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి స్టార్ అవ్వాలంటే అది చిన్న విషయం కాదు.
కొంతమందికి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా అదృష్టం తోడై అవకాశాలు వస్తాయి కానీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా వారు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు.అలాంటి వారిలో ఒకడు ఫహద్ ఫాజిల్.
( Fahadh Faasil ) ప్రస్తుతం పుష్ప చిత్రం ( Pushpa Movie ) ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో పరిచయమైన ఈ నటుడు ఆషామాషీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వాడు కాదు.ఇతడికి చాలా గట్టి బ్యాగ్రౌండ్ ఉంది.
తన తండ్రి భారతదేశం గర్వించదగ్గ ఒక దర్శకుడు.
అలాంటి ఒక తండ్రిని వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు అంటే అతనిపై కూడా ఎన్నో అంచనాలు ఉంటాయి.ఆ అంచనాలు ఏమాత్రం తగ్గిన సోషల్ మీడియా చేతిలో ట్రోల్ అవ్వడం తప్ప మరొకటి ఉండదు.అయితే డైరెక్టర్ ఫాజిల్ కుమారుడని ఇండస్ట్రీలో ఎంట్రీ బాగానే దొరికింది ఫహద్ ఫాజిల్ కి. మొట్టమొదటగా అతడు 2002లో కైయెతుమ్ దూరత్( Kaiyethum Doorath ) అనే ఒక సినిమాతో తన కెరియర్ ను ప్రారంభించాడు.ఆ సమయంలో ఫహద్ కి కేవలం 20 సంవత్సరాలు మాత్రమే.
సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఆశ తప్ప నటనలో అనుభవం లేదు.దాంతో అతని నటన నచ్చక చాలామంది చేత నెగటివ్ కామెంట్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఆ సినిమా కూడా పరాజయం పాలు కావడంతో ఇక తనకు ఇండస్ట్రీ వెల్కమ్ చెప్పదని, నటన తనకు వద్దు అనుకొని దాదాపు ఏడేళ్ల పాటు మళ్ళీ సినిమాలలోకి రావాలనుకోలేదు.
ఈ సమయంలో చాలానే డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు.ఇంత పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికి నటుడిగా తాను నిలబెట్టుకోలేకపోవడం అతని కెరియర్ లో పెద్ద మచ్చగా మారింది.ఆ సినిమాలో హీరోయిన్ గా నికిత నటించింది.
పైగా ఫహద్ పేరు షాను అని కూడా స్క్రీన్ పై తొలిసారి పడింది.ఆ తర్వాత యుఎస్ కి వెళ్లిపోయి ఐదేళ్ల పాటు అక్కడే తన చదువులను పూర్తి చేసుకుని మళ్లీ ఇండియాకి వచ్చాడు.2009లో చాలామంది ప్రోత్సాహంతో మళ్ళీ కేరళ కేఫ్( Kerala Cafe ) అనే సినిమాతో నటించి ఆ తర్వాత వరుస సినిమాలో నటించి నటుడుగా నిడదొక్కుకున్నాడు.ప్రస్తుతం పాన్ ఇండియా వ్యాప్తంగా ఒక మంచి విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నాడు.