చెన్నైలో బాగా బలిసిన ఒక ఆర్థిక సామ్రాజ్యపు వారసురాలు నడుపుతున్న జట్టు మన సన్ రైజర్స్

ఐపీఎల్ లో ఈసారి మన సన్ రైజర్స్ జట్టు చాలా బాగా ఆడుతుంది.కప్పు కూడా కొట్టే ఛాన్స్ ఉంది అని అందరూ ఎనాలసిస్ చేస్తున్నారు.

 Facts Behind Hyderabad Sun Risers Team , Hyderabad Sun Risers Team, Hyderabad S-TeluguStop.com

కానీ ఒక్కసారి హైదరాబాద్ సన్ రైజర్స్( Hyderabad Sunrisers ) జట్టు మూలాల్లోకి వెళితే ఈ జట్టు ఎవరిది ? ఎవరు నడుపుతున్నారు ? ఎలా దీని పుట్టుక జరిగింది ? దీనికి వారసులు ఎవరు ? హైదరాబాద్ తన నెత్తిన పెట్టుకోవడం సబబేనా ? బాగా ఆడుతున్నారు అంటూ తెలుగు రాష్ట్రాలు దీని గురించి ప్రస్తుతం ఎంతో హంగామా హడావిడి చేస్తున్నారు.సోషల్ మీడియా ఎక్కడ చూసినా కూడా దీని గురించి మాట్లాడుతున్నారు.

ఏదో మన ఇంట్లో వాళ్ళు ఆట ఆడుతున్నట్టు సంబరాలు చేసుకుంటున్నారు.కానీ ఇది పూర్తిగా ఒక ఆర్థిక, సామాజిక, రాజకీయ నేపథ్యం ఉన్న ఒక బడా సామ్రాజ్యపు ఆటవిడుపు కోసం పెట్టుకున్నా పేరు.

Telugu Big Businessmen, Hyderabadsun, Kalanidhi Maran, Kavya-Sports News క్

సన్ రైజర్స్ ఓనర్ కళానిధి మారన్( Kalanidhi Maran ) .ఆయన కూతురే మన కావ్య ( kavya )పాప.సన్ గ్రూప్ అంటే తెలుసు కదా వారు లేని రంగం లేదు.మీడియా, రాజకీయం, వ్యాపారం అన్నింట వారే.ఇక కరుణానిధికి ఈ కళానిధి మారన్ అంటే ప్రస్తుత తమిళనాడు సీఎం స్టాలిన్ కి బావ.అయినా మనం ఐపీఎల్ ని ఇంత నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం లేదు.గతంలో సంస్థానాలు నడిపేవారు, రాజులు తమ సంతోషం కోసం కుస్తీ పోటీలను నిర్వహించేవారు.ఇప్పుడు ఐపీఎల్ ఆడిస్తున్నారు అంతే తేడా.మనదేశంలోని బడా వ్యాపారస్తులు వారి సంతోషం కోసం, డబ్బు కోసం ఏర్పాటు చేసుకున్నదే ఈ ఐపీఎల్.డబ్బుకు డబ్బు, బోలెడంత పేరు.

షాట్స్ కొడితే క్రికెటర్స్ ని కుక్కపిల్లల్లా చేసి డబ్బులు కురిపించడం ఈ ఆట యొక్క స్పెషాలిటీ.

Telugu Big Businessmen, Hyderabadsun, Kalanidhi Maran, Kavya-Sports News క్

బంతి బాదినప్పుడల్లా మనం సంతోషపడుతున్నాం.కానీ ఇది ఎవరి కోసం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని మర్చిపోయాం.మన హైదరాబాద్ పేరు పెట్టుకొని చెన్నైలో వ్యాపారాలు చేసేవారు డబ్బు సంపాదిస్తున్నారు.

ఇది వారికి చాలా కామన్.పేరు ఏదైతేనే డబ్బు కుప్పలు కుప్పలుగా వస్తుంది.

ఇప్పుడైనా నిజాలు తెలుసుకోండి.ఈ ఐపీఎల్ వెనుక జరుగుతున్నది అంతా కూడా ఒక దందా.

ఈ ఉచ్చులో పడి యువత చెలరేగిపోతున్నారు.దీని పేరుతో అనేక స్పోర్ట్స్ ఆప్స్ రంగంలోకి దిగి యువతను పాడుచేస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube