ఒక సినిమా సెట్స్ పైన ఉండగానే దాదాపు మూడు నుంచి నాలుగు సినిమాల ప్లానింగ్ చేసేస్తున్నాడు నాని( Nani ).గత కొన్ని రోజులుగా ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు.
ఒకటి పోయినా మరొకటి త్వరగా నే వచ్చేస్తుంది కాబట్టి గత సినిమా పరాజయం తాలూకా గాయాలు ఉండవు కదా.అందుకే సినిమాల ఎంపిక చాలా త్వరగా చేసేస్తున్నాడు.పైగా అచ్చొచ్చిన దర్శకులకే అవకాశాలు ఇస్తున్నాడు.గతంలో తను పని చేసిన దర్శకులకే మరో సినిమా చేసే వారిపై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తున్నాడు నాని.ఇప్పుడు ప్రస్తుతం నాని తీస్తున్న సినిమాలు ఏంటి ? లైన్ లో పెట్టిన మిగతా దర్శకులు(Directors ) ఎవరు ? అనే విషయాలను ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

నాని దసరా మరియు హాయ్ నాన్న( Dussehra, Hi Nanna ) సినిమాలతో చాలా తక్కువ రోజుల క్రితమే సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసి రెండు మంచి సినిమాలను అందించాడు.అయితే ఇప్పుడు వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం( Saripoda sanivaram ) అనే సినిమా ఆగస్టులో విడుదలకు సిద్ధమవుతుంది.ఈ సినిమా చేయడానికి అంటే ముందే అంటే సుందరానికి సినిమాతో వీరిద్దరి కాంబో బాగానే వర్కౌట్ అయింది.
ఇలా గతంలో సైతం మోహన కృష్ణ ఇంద్రగంటితో కూడా అష్టా చమ్మా, జెంటిల్ మెన్, వి అనే మూడు చిత్రాలను చేశాడు నాని.అలాగే శివ నిర్వాణ దర్శకత్వంలో నిన్ను కోరి, జగదీష్ వంటి రెండు సినిమాలు చేశాడు.

ఇప్పుడు దసరా సినిమా తీసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) తో మరో చిత్రాన్ని చేయడానికి అంగీకరించాడు.అలాగే సుజిత్ సినిమాకి కూడా ఒప్పుకున్నా నాని గౌతమ్ తిననూరితో సైతం మరో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడట.గతంలో వీరిద్దరి కాంబినేషన్లో జెర్సీ సినిమా వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే.ఇది కాకుండా బలగం వేణుతో ఎల్లమ్మ అనే పేరుతో ఓ చిత్రంలో నటిస్తున్నాడు నాని.
ఇలా గతంలో పని చేసిన అందరి దర్శకులకు మళ్లీ మరో సినిమా చేస్తూ సేఫ్ ప్లానింగ్ చేసుకుంటున్నాడు.ఏదేమైనా నాని ప్లాన్ అదిరిపోయింది కదా.







