ఒకే సినిమా తో ఎంతో సాహసం చేసిన జమున.. రెబల్ స్టార్ గా మారిన కృష్ణం రాజు

బంగారు తల్లి( Bangaru Thalli Movie ) అనే సినిమా 1971లో వచ్చింది.ఈ చిత్రంలో జమున( Jamuna ) నట విశ్వరూపం మనం కల్లారా చూడొచ్చు.

 Facts About Bangaru Thalli Movie Details, Bangaru Thalli Movie, Jamuna, Krishnam-TeluguStop.com

అప్పటి వరకు ఆమె ఒక గ్లామర్ క్వీన్ గా, సత్యభామగా వెండితెరపై అద్భుతమైన హోయలు ఒలికించిన జమున ఈ సినిమాతో ఎంతో ధైర్యంగా ఒక డీ గ్లామర్ పాత్రలో నటించడానికి ముందుకు వచ్చింది.వాస్తవానికి జమున ఈ పాత్ర ఒప్పుకుంది అని తెలియగానే చాలామంది వద్దు అని వారించారు.

అయినా కూడా మొండిగా ఈ సినిమా చేయాలని ఆమె నిర్ణయించుకుంది.ఈ చిత్రంలో ఆమె ముసలి పాత్రలో కూడా నటించాల్సి వచ్చింది.

ఆమె కొడుకులుగా శోభన్ బాబు,( Sobhan Babu ) కృష్ణంరాజు ( Krishnam Raju ) నటించారు.ఈ సినిమాతోనే కృష్ణంరాజు ఒక రెబల్ స్టార్ గా మారారు అని అనుకోవచ్చు.

అప్పటి వరకు ఆయనకు ఒక్క సరైన పాత్ర పడలేదు కానీ బంగారు తల్లి సినిమా కృష్ణంరాజులో ఉన్న ఒక రెబల్ స్టార్ ని ప్రపంచానికి పరిచయం చేసింది.

Telugu Actress Jamuna, Aurat, Bangaru Thalli, Jamuna, Jamunabangaru, Krishnam Ra

ఈ సినిమా తెలుగులో బ్రహ్మాండమైన వసూళ్లను వసూలు చేసింది.అయితే తెలుగులో చాణక్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి మాతృక హిందీలో మదర్ ఇండియా( Mother India ) అనే పేరుతో 1957లో వచ్చింది.దీంట్లో జమున పాత్రలో నర్గీస్ ( Nargis ) నటించగా, కలెక్షన్స్ తెలుగుతో పోలిస్తే హిందీ లో చాలా తక్కువగానే వచ్చాయి.

హిందీ సినిమా కూడా చాలా బాగుంది.అప్పట్లో ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను మన ప్రధానమంత్రి నెహ్రూ అలాగే రాష్ట్రపతిగా ఉన్న బాబు రాజేంద్రప్రసాద్ ప్రత్యేకమైన ఒక షో వేయించుకొని చూశారట.

అలాగే చిత్రానికి అనేక అవార్డులు దక్కగా ఉత్తమ చిత్రం తో పాటు ఫిలింఫేర్ అవార్డులను కూడా పొందింది.

Telugu Actress Jamuna, Aurat, Bangaru Thalli, Jamuna, Jamunabangaru, Krishnam Ra

ఇప్పటి తరం వారికి ఇలాంటి సినిమాలు పెదగా నచ్చకపోవచ్చు.కానీ ఖచ్చితంగా చూడవలసిన సినిమా అని మాత్రం చెప్పక తప్పదు.1940లో ఔరత్( Aurat Movie ) అన్న ఒక సినిమా రాగా దాన్ని ఆధారంగా చేసుకుని మదర్ ఇండియా సినిమాను తీశారు.మదర్ ఇండియా చిత్రాన్ని ఆధారంగా చేసుకుని బంగారు తల్లి సినిమా తీశారు.అన్ని విధాలుగా తెలుగులో ఈ సినిమా బ్రహ్మాండమైన కలెక్షన్స్ సాధించి మంచి విజయాన్ని అందుకుంది.

చూడాలనుకుంటే యూట్యూబ్ ఈ మూడు సినిమాలు ఉన్నాయ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube