ఒకే సినిమా తో ఎంతో సాహసం చేసిన జమున.. రెబల్ స్టార్ గా మారిన కృష్ణం రాజు
TeluguStop.com
బంగారు తల్లి( Bangaru Thalli Movie ) అనే సినిమా 1971లో వచ్చింది.
ఈ చిత్రంలో జమున( Jamuna ) నట విశ్వరూపం మనం కల్లారా చూడొచ్చు.
అప్పటి వరకు ఆమె ఒక గ్లామర్ క్వీన్ గా, సత్యభామగా వెండితెరపై అద్భుతమైన హోయలు ఒలికించిన జమున ఈ సినిమాతో ఎంతో ధైర్యంగా ఒక డీ గ్లామర్ పాత్రలో నటించడానికి ముందుకు వచ్చింది.
వాస్తవానికి జమున ఈ పాత్ర ఒప్పుకుంది అని తెలియగానే చాలామంది వద్దు అని వారించారు.
అయినా కూడా మొండిగా ఈ సినిమా చేయాలని ఆమె నిర్ణయించుకుంది.ఈ చిత్రంలో ఆమె ముసలి పాత్రలో కూడా నటించాల్సి వచ్చింది.
ఆమె కొడుకులుగా శోభన్ బాబు,( Sobhan Babu ) కృష్ణంరాజు (
Krishnam Raju ) నటించారు.
ఈ సినిమాతోనే కృష్ణంరాజు ఒక రెబల్ స్టార్ గా మారారు అని అనుకోవచ్చు.
అప్పటి వరకు ఆయనకు ఒక్క సరైన పాత్ర పడలేదు కానీ బంగారు తల్లి సినిమా కృష్ణంరాజులో ఉన్న ఒక రెబల్ స్టార్ ని ప్రపంచానికి పరిచయం చేసింది.
"""/" /
ఈ సినిమా తెలుగులో బ్రహ్మాండమైన వసూళ్లను వసూలు చేసింది.అయితే తెలుగులో చాణక్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి మాతృక హిందీలో మదర్ ఇండియా( Mother India ) అనే పేరుతో 1957లో వచ్చింది.
దీంట్లో జమున పాత్రలో నర్గీస్ ( Nargis ) నటించగా, కలెక్షన్స్ తెలుగుతో పోలిస్తే హిందీ లో చాలా తక్కువగానే వచ్చాయి.
హిందీ సినిమా కూడా చాలా బాగుంది.అప్పట్లో ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను మన ప్రధానమంత్రి నెహ్రూ అలాగే రాష్ట్రపతిగా ఉన్న బాబు రాజేంద్రప్రసాద్ ప్రత్యేకమైన ఒక షో వేయించుకొని చూశారట.
అలాగే చిత్రానికి అనేక అవార్డులు దక్కగా ఉత్తమ చిత్రం తో పాటు ఫిలింఫేర్ అవార్డులను కూడా పొందింది.
"""/" /
ఇప్పటి తరం వారికి ఇలాంటి సినిమాలు పెదగా నచ్చకపోవచ్చు.కానీ ఖచ్చితంగా చూడవలసిన సినిమా అని మాత్రం చెప్పక తప్పదు.
1940లో ఔరత్( Aurat Movie ) అన్న ఒక సినిమా రాగా దాన్ని ఆధారంగా చేసుకుని మదర్ ఇండియా సినిమాను తీశారు.
మదర్ ఇండియా చిత్రాన్ని ఆధారంగా చేసుకుని బంగారు తల్లి సినిమా తీశారు.అన్ని విధాలుగా తెలుగులో ఈ సినిమా బ్రహ్మాండమైన కలెక్షన్స్ సాధించి మంచి విజయాన్ని అందుకుంది.
చూడాలనుకుంటే యూట్యూబ్ ఈ మూడు సినిమాలు ఉన్నాయ్.
ఆ స్టార్ హీరోలకు దిమ్మతిరిగే షాకిచ్చిన పవన్ కళ్యాణ్.. డేట్ విషయంలో మార్పు లేనట్టేనా?