మిగిలిన‌ అన్నం పారేస్తున్నారా? ఇక‌పై ముఖానికి ఇలా వాడేయండి!

సాధార‌ణంగా చాలా మంది వండుకుని తిన్నాక మిగిలిన అన్నంను డ‌స్ట్ బిన్‌లోకి తోసేస్తుంటారు.

ఇలా దాదాపు అంద‌రి ఇళ్ల‌ల్లోనూ ఎంతో కొంత అన్నం వేస్ట్ అవుతూనే ఉంటుంది.

కానీ, ఇకపై మిగిలిన అన్నం పారేయ‌కండి.ఎందుకంటే, అన్నంలో ఎన్నో పోష‌క విలువ‌లు నిండి ఉంటాయి.

అవి చ‌ర్మ సౌంద‌ర్యానికి ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి.కెమిక‌ల్స్‌తో నిండి ఉండే స్కిన్ కేర్ ప్రోడెక్ట్స్‌ను వాడ‌టం కంటే.

చ‌క్క‌గా ఇంట్లో తిన్నాక మిగిలి పోయిన అన్నంతోనే సౌంద‌ర్యాన్ని రెట్టింపు చేసుకోవ‌చ్చు.మ‌రి అన్నంను చ‌ర్మానికి ఎలా ఉప‌యోగించాలి.? అస‌లు అన్నం వ‌ల్ల వ‌చ్చే సౌంద‌ర్య ప్ర‌యోజ‌నాలు ఏంటీ.? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో వండిన అన్నం, కొద్దిగా వాట‌ర్ పోసి మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.

Advertisement

ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ బాదం నూనె, ఒక స్పూన్ కొబ్బ‌రి నూనె వేసుకుని బాగా మిక్స్ చేయాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించి.

ఇర‌వై నిమిషాల పాటు డ్రై అవ్వ‌నివ్వాలి.అనంత‌రం కూల్ వాట‌ర్‌తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఇలా త‌ర‌చూ చేస్తే ముడ‌త‌లు, స‌న్న‌ని గీత‌ల‌, చార‌లు తొల‌గిపోయి ముఖం య‌వ్వ‌నంగా, కాంతివంతంగా మెరిసిపోతుంది.

అలాగే మిక్సీ జార్‌లో నాలుగైదు స్పూన్ల అన్నం, అర స్పూన్ అవాలు, పావు క‌ప్పు వెన్న తీసిన మ‌జ్జిగ‌ వేసుకుని పేస్ట్‌లా చేసుకోవాలి.ఆ త‌ర్వాత ఇందులో చిటికెడు క‌స్తూరి ప‌సుపు వేసి క‌లుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

ఆరేంత వ‌ర‌కు వ‌దిలేయాలి.ఆపై స్మూత్‌గా స్క్ర‌బ్ చేసుకుంటూ గోరు వెచ్చ‌ని నీటితో వాష్ చేసుకోవాలి.

Advertisement

ఈ ప్యాక్ వ‌ల్ల మొటిమ‌లు, వాటి తాలూకు మ‌చ్చ‌లు త‌గ్గుతాయి.మ‌రియు చ‌ర్మంపై పేరుకుపోయిన అధిక జిడ్డు తొల‌గిపోయి చ‌ర్మం గ్లోగా, ప్ర‌కాశ‌వంతంగా మారుతుంది.

తాజా వార్తలు