వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్‌లో జాప్యం.. భారతీయుల్లో ఆందోళన, బ్లింకెన్ వద్ద ప్రస్తావించిన జైశంకర్

భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అమెరికా పర్యటనలో బిజిబిజీగా గడుపుతున్నారు.దీనిలో భాగంగా మంగళవారం అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్‌తో జరిగిన సమావేశంలో భారతీయులు ఎదుర్కొంటున్న వీసా దరఖాస్తుల బ్యాక్‌లాగ్ సమస్యను జైశంకర్ లేవనెత్తారు.

 External Affairs Minister Jaishankar Raises Visa Delay Issues With Us , Minister-TeluguStop.com

దీనిపై ఆంటోనీ బ్లింకెన్ సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.కోవిడ్ కారణంగా మార్చి 2020లో ప్రపంచవ్యాప్తంగా వున్న యూఎస్ మిషన్‌లలో వీసా ప్రాసెసింగ్‌లను అమెరికా ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే.

అయితే ప్రస్తుతం పరిస్ధితులు చక్కబడటంతో వీసా సేవల బ్యాక్‌లాగ్‌లను క్లియర్ చేయడానికి అమెరికా రంగంలోకి దిగింది.ఇకపోతే.

 External Affairs Minister Jaishankar Raises Visa Delay Issues With US , Minister-TeluguStop.com

నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులకు మంజూరు చేసే హెచ్ 1 బీ , ఇతర వర్క్ వీసాలు అందుకునే వారిలో భారతీయులు పెద్ద సంఖ్యలో వున్నారు.

భారత జాతీయ విద్యా విధానంపై అమెరికా ప్రభుత్వం ఆసక్తి చూపిందని ఆయన అన్నారు.

విద్యా రంగంలో అమెరికాతో భాగస్వామ్యాన్ని విస్తరించడానికి ఇది ఉపయుక్తంగా వుంటుందని జైశంకర్ పేర్కొన్నారు.విద్య, వ్యాపారం, సాంకేతికత, కుటుంబాల పునరేకీకరణలు అన్నది వీసాపైనే ఆధారపడి వుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం వీసా ప్రాసెసింగ్ సమయం 800 రోజులు పడుతోందని .దీనిపై బ్లింకెన్‌తో చర్చించినట్లు జైశంకర్ పేర్కొన్నారు.

అనంతరం అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి బ్లింకెన్ మాట్లాడుతూ.భారతీయుల వీసా దరఖాస్తుల బ్యాక్‌లాగ్‌కు కోవిడ్ 19 కారణమన్నారు.కరోనా మహమ్మారి సమయంలో వీసాలు జారీ చేసే సామర్ధ్యం గణనీయంగా పడిపోయిందని బ్లింకెన్ అంగీకరించారు.పరిమితమైన వనరులు, దౌత్య కార్యాలయాల్లో సిబ్బంది కొరత కూడా ఇందుకు కారణమని ఆయన తెలిపారు.

అయితే ఈ సమస్యను ఎదుర్కోవడానికి తన వద్ద ఒక ప్రణాళిక వుందని బ్లింకెన్ వెల్లడించారు.రాబోయే నెలల్లో దీనిని అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube