యూఎస్ : ఫ్లోరిడాలో ఎఫ్‌బీఐ సోదాలు.. డొనాల్డ్ ట్రంప్‌కు ఇండో అమెరికన్ల మద్ధతు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ఫ్లోరిడాలోని మార్ ఏ లాగో రిసార్ట్స్‌లో ఎఫ్‌బీఐ తనిఖీల వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.రాజకీయంగా కక్ష సాధించడంతో పాటు 2024 ఎన్నికల్లో తనను పోటీచేయకుండా అడ్డుకునేందుకు డెమొక్రాట్లు కుట్రపన్నారంటూ ట్రంప్ ఆరోపిస్తున్నారు.

 Ex Us President Donald Trump’s Indian American Supporters Condemn Fbi Raid On-TeluguStop.com

ఈ నేపథ్యంలో జో బైడెన్‌పై రిపబ్లికన్ నేతలు , మద్ధతుదారులు మండిపడుతున్నారు.తాజాగా ట్రంప్‌కు మద్ధతు పలికారు భారత సంతతి అమెరికన్లు.

ఫ్లోరిడాలోని ఓకాలకు చెందిన మొదటితరం అమెరికన్ ఎంటర్‌ప్రెన్యూయర్, కమ్యూనిటీ నేత, ట్రంప్ మద్ధతుదారుడైన దిగ్విజమ్ గైక్వాడ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.ఇది అన్యాయమని, గతంలో ఎన్నడూ వినలేదన్నారు.

అలాగే మరికొందరు భారతీయ అమెరికన్ మద్ధతుదారులు కూడా ట్రంప్ కోసం రోడ్లపైకి వచ్చారు.ఎఫ్‌బీఐ చర్య రాజకీయంగా ప్రేరేపించబడిందని వారు ఆరోపించారు.

దర్యాప్తుకు ఇది సరైన మార్గం కాదని.భారతీయ అమెరికన్, ట్రంప్ ప్రచార సభ సభ్యురాలు డాక్టర్ శోభ అన్నారు.ఎవరూ చట్టానికి అతీతులు కాదని, కానీ సరైన పద్ధతిలో నిర్వర్తించాలని ఆమె సూచించారు.

2024 అధ్యక్ష ఎన్నికలకు ట్రంప్ సిద్ధమవుతోన్న తరుణంలో లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఈ స్క్రూటీని ఆరంభించారని న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీకి డిస్ట్రిక్ట్ 16 నుంచి పోటీ చేస్తున్న రిపబ్లికన్ అభ్యర్ధి విభూతి ఝా అన్నారు.ఇది దిగ్భ్రాంతికర పరిణామమన్న ఆయన.డెమొక్రాటిక్ పార్టీకి ట్రంప్ ఓ పీడకలగా అభివర్ణించారు.ట్రంప్ ఫండ్‌రైజర్, మద్ధతుదారు అల్ మాసన్ మాట్లాడుతూ.డెమొక్రాట్లకు చాలా తక్కువ రేటింగ్‌లు వున్నందున, వారు ట్రంప్‌ను కథాంశంగా సృష్టించారని ఆరోపించారు.అయితే ఈ దాడి ట్రంప్‌కు సానుకూలంగా మారుతుందని.2024లో ఆయన ఖచ్చితంగా అధ్యక్షుడిగా వుంటారని మాసన్ జోస్యం చెప్పారు.

కాగా.2021 అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాతి నుంచి ట్రంప్ తన రాజకీయ కార్యకలాపాలను ఇక్కడి నుంచే నిర్వహిస్తున్నారు.వైట్‌హౌస్‌ను వీడే సమయంలో క్లాసిఫైడ్ రికార్డులను ట్రంప్ మార్‌-ఎ-లాగోకు తీసుకొచ్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 10 గంటలకు రిసార్ట్‌లోని గోల్ఫ్‌ క్లబ్‌లో సోదాలు నిర్వహించిన ఎఫ్‌బీఐ అధికారులు 15 బాక్స్‌లను తీసుకుని తిరిగి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది.

దాదాపు 30 మంది ఎఫ్‌బీఐ ఏజెంట్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.ఇవన్నీ కూడా ట్రంప్ తీసుకొచ్చారనే ఆరోపణలు వున్నాయి.

Telugu Donaldtrumps, York Assembly, Trump-Telugu NRI

ఇందులో దేశానికి సంబంధించిన రహస్య పత్రాలు , కీలక పత్రాలు వున్నట్లుగా తెలుస్తోంది.ఒకవేళ ఈ క్లాసిఫైడ్ పత్రాలను ట్రంప్ అక్రమంగా తీసుకెళ్లినట్లు రుజువైతే మాత్రం చట్టపరంగా చర్యలు తప్పవని అమెరికన్ న్యాయ నిపుణులు చెబుతున్నారు.అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఏ పదవి చేపట్టకుండా ట్రంప్‌పై నిషేధం విధించే అవకాశం వుంది.అదే జరిగితే 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ఆయన అనర్హుడు.మరి ఏం జరుగుతుందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube