యాంకర్ : నెల్లూరులోని స్వర్ణాల చెరువులో రొట్టెలను పట్టుకున్నారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకరించాలని కోరుతూ రొట్టెలు మార్చుకున్నారు.
విభజన హామీలను కేంద్రం నెరవేర్చేలా చూడాలని రొట్టెను స్వీకరించిన ఎమ్మెల్యే రైల్వే జోన్ , పోలవరం నిర్మాణానికి నిధులు ఇవ్వాలని కోరుకున్నారు.
అనంతరం సాధారణ క్యూలో వెళ్లి బారాషహిదులను దర్శనం చేసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అన్ని విధాలా సహకరించాలని రొట్టెను పట్టుకున్నట్టు శ్రీధర్ రెడ్డి చెప్పారు.అన్ని శాఖల అధికారుల సమన్వయంతో భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు.







