సీఎం ఇంటిముందు ధర్నా చేస్తానంటూ మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు..!!

వైసీపీ పార్టీలో కీలక నేతలలో మాజీమంత్రి పేర్ని నాని( perni nani ) ఒకరు.

ప్రత్యర్ధులు సీఎం వైఎస్ జగన్( CM YS Jagan ) ని లేదా వైసీపీ పార్టీని విమర్శిస్తే కౌంటర్ ఇవ్వటంలో ఎప్పుడు కూడా ముందుంటారు.

అటువంటి పేర్ని నాని తాజాగా ఏకంగా సీఎం జగన్ ఇంటి ముందు ధర్నా చేస్తానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.విషయంలోకి వెళ్తే ఇటీవల ఉమ్మడి కృష్ణ జేడ్పి సమావేశాలు జరిగాయి.

అయితే ఈ సమావేశానికి అధికారులు గైర్హాజరవటంతో పేర్ని నాని అసహనం వ్యక్తం చేశారు.ఏలూరు జిల్లా కలెక్టర్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరు కాకపోవటం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

జేడ్పి సమావేశాలకు వచ్చే ఉద్దేశం కలెక్టర్ కు లేదా అని ప్రశ్నించారు.

Advertisement

మీటింగులకు వచ్చే ఉద్దేశం లేకపోతే జేడ్పిటీసీ లతో కలిసి ముఖ్యమంత్రి ఇంటిముందు ధర్నా చేస్తానని పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.జేడ్పి సమావేశాలకు తనతో పాటు జేడ్పిటీసీలు, ఎంపీటీసీలు( ZPTCs, MPTCs ) ఇతర ప్రజా ప్రతినిధులు హాజరైతే కలెక్టర్ మరియు ఉన్నతాధికారులు ఎందుకు హాజరు కాలేదు అని నిలదీయడం జరిగింది.ఇదే రీతిలో మరోసారి జేడ్పి సమావేశానికి గైర్హాజరైతే ముఖ్యమంత్రి అదే విధంగా చీఫ్ సెక్రటరీ కార్యాలయాల వద్ద నిరసన తెలియజేస్తానని హెచ్చరించారు.

ఈ రకమైన ధోరణి అధికారులకు మంచిది కాదని పేర్ని నాని అసహనం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు